Bhuvanagiri Women murdered her husband: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. స్పాట్  లో బైక్ ఉన్న వ్యక్తి చనిపోయాడు. విషయం తెలిసి ఆయన భార్యతో పాటు ఇతర బంధువులు అంతా శోకాండాలు పెట్టి ఏడ్చారు. ఆయన భార్య అయితే చెప్పాల్సిన పని లేదు. ఇత తన జీవితం ఏమయిపోయిందో భగవంతుడా అని ఏడ్చినామె ఏడ్చినట్లే ఉంది. అన్ని పనులు అయిపోయాయి. అందరూ రోడ్డు ప్రమాదమే అనుకున్నారు. కానీ పోలీసులు అనుకోలేదు. అక్కడే కథ మలుపు తిరిగింది.                  

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి పేరు వస్తువుల స్వామి. అతనికి పెళ్లి అయింది. భార్యతో సరిపడటం లేదు. కానీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు మొదట దీన్ని రోడ్డు ప్రమాదమనే అనుకున్నారు. కానీ అసలు ప్రమాదం చేసిన వాహనం ఏంటో తెలియలి కదా అని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి చివరికి.. ఓ కారు ఢీ కొట్టిందని నిర్దారించుకున్నారు. ఆ కారు ఓనర్ ను ముందు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమీ తెలియదని..తాను కారును బాడుగకు ఇచ్చానని చెప్పాడు.                     

ప్రమాదం జరిగిన రోజున కారు ఎవరు బాడుగకు తీసుకున్నారో తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట వారు నిజాలు చెప్పలేదు. కానీ అబద్దాలు చెప్పాలనుకుని కంగారు పడ్డారు. దాంతో పోలీసులకు డౌట్ వచ్చింది. తమదైన స్టైల్లో విచారిస్తే అది ప్రమాదం కాదని.. కావాలని చేసిన హత్య అని స్పష్టం అయింది. అసలేం జరిగిందో పోలీసులు వారి దగ్గర నుంచే పూర్తి సమాచారం రాబట్టారు. వీళ్లు చెప్పిన వివరాలు.. దొరికిన క్లూస్ అన్నీ కలిపి చూస్తే విషయం అర్థమైపోయింది. వెంటనే వెళ్లి వస్తువుల స్వామి భార్యను అదుపులోకి తీసుకున్నారు.                       

వస్తువుల స్వామి భార్య . భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. తన సోదరుడితో కలిసి పెద్ద స్కెచ్ వేసింది. పనుల కోసం స్వామి  కాటేపల్లి  రోడ్డులో ఎక్కువగా ప్రయాణం చేస్తూంటాడని.. ఆ రోడ్డులో అతనిని యాక్సిడెంట్ చేస్తే.. పనైపోతుదంని అనుకున్నారు. వెంటనే.. కొంత మంది సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకుని తమ ప్లాన్ అమల్లోకి పెట్టారు. అద్దెకారుతో కాపు కాసి.. స్వామిని బలంగా ఢీకొట్ట  హత్య చేశారు. మొత్తం వివరాలు తెిలయడంతో స్వామి భార్యతో పాటు బావమరిది, సుపారి కిల్లర్స్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జైలుకు పంపించారు. ఈ కేసులో వాళ్లు స్వామిని చంపడానికి ప్లాన్ చేసిన వైనం చూసి పోలీసులు నివ్వెరపోయారు.