Lifestyle Tips to Avoid Hospitals : ఆస్పత్రికి వెళ్లాలని.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి. అందుకే జీవితంలో డాక్టర్ల వద్దకి వెళ్లకూడదని అనుకుంటున్నారా? అయితే లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాలని అంటున్నారు నిపుణులు. దీనిలో భాగంగానే.. కిఫి హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం కొన్ని సూచనలు ఇచ్చారు. ఇన్‌స్టా వేదికగా వాటిని షేర్ చేశారు. ఈ టిప్స్ ఫాలో అయితే జన్మలో ఆస్పత్రికి వెళ్లరంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..
నిద్ర - ఇమ్యూనిటికై..
ఆరోగ్యంగా ఉండాలంటే అతిప్రధానంగా ఫాలో అవ్వాల్సిన మొదటి టిప్ నిద్ర. స్లీపింగ్ సైకిల్‌ను ఎంత త్వరగా రీసెట్ చేసుకుంటే.. అంత త్వరగా మీరు రికవరీ అవుతారు. దీనిలో భాగంగా డాక్టర్ ఇస్తోన్న సూచనలు ఏంటంటే.. "వీలైనంత త్వరగా నిద్రపోండి. త్వరగా లేవండి. శరీరానికి నిద్ర చాలా అవసరం. రోజూ రాత్రి క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోమంటున్నారు. నిద్ర సరిగ్గా లేకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల మీకు ఇన్ఫెక్షన్లు, ఇతర రోగాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా త్వరగా ముసలివాళ్లు అయిపోతారు."
గోరువెచ్చని నీరు - టాక్సిన్లను పంపేందుకు
రోజూ నిద్ర లేచిన తర్వాత ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. "గోరువెచ్చని నీటిని తాగితే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. అలాగే శరీరానికి నీరు అందుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉండదు."
మెడిటేషన్ - మానసిక ప్రశాంతతకై
"రోజూ పది నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఇలా చేస్తే మీ స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. పనిపై ఫోకస్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది."
నడక - షుగర్ కంట్రోల్
"తిన్న తర్వాత కనీసం ఓ పది నిమిషాలు నడవండి. ఇలా నడిస్తే రక్తంలో షుగర్ స్పైక్స్ ఉండవు. అలాగే జీర్ణ సమస్యలు దూరమవుతాయి."
ఫుడ్ విషయంలో - పూర్తి ఆరోగ్యానికి
"తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి.. "రంగురంగుల కూరగాయలు, కలర్‌ఫుల్ ఫ్రూట్స్ తినాలి. బ్రౌన్ రైస్ తినాలి. వైట్ రైస్ తినకపోవడమే మంచిది. సీడ్స్, నట్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ తింటే ఇన్ఫ్లమేషన్ రాకుండా, క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. పప్పులు, చేపలు, గుడ్లు, మొలకలు, నట్స్ ఎక్కువగా తినాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినకూడదు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు."
తినకూడని ఫుడ్స్ - మెటబాలీక్ డిసీజ్‌లు
"నూనె వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే ప్యాకెట్ ఆయిల్ కాకుండా మీరు నూనెను ఆడించి తీసుకుంటే మంచిది. చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఆహారాల జోలికి వెళ్లకూడదు. షుగర్స్ తగ్గించాలి. ఉప్పు తక్కువ తినాలి. ఎందుకంటే వీటిని తినడంవల్ల మెటబాలీక్ డిసీజ్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది."
మీల్ టైమింగ్స్ - బాడీ రికవరీకి
"రాత్రి భోజనం 7లోపు ముగించేలా చూసుకోండి. మార్నింగ్ టిఫిన్ 9 గంటలకు తినండి. దీనివల్ల 14 గంటలు ఫాస్టింగ్ స్టేజ్‌లో ఉంటారు. దీనివల్ల బాడీ రికవరీ అవ్వడం సులభం అవుతుంది."
వ్యాయామం - పూర్తి ఆరోగ్యానికి
"రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ ఇలా ఏదొక యాక్టివిటీని చేస్తే మంచిది. రోజూ 10 నిమిషాలు యోగా చేయాలి. దీనివల్ల బాడీకి ఫ్లెక్సీబులిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది."
మరిన్ని టిప్స్
"రోజూ చన్నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. నోటి ఆరోగ్యం బాగుంటే గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తినేముందు, టాయిలెట్‌కి వెళ్లి వచ్చిన తర్వాత కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చాలావరకు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. భర్తతో లేదా భార్యతో లేదా పిల్లలతో మీ రిలేషన్ బాగుంటే ఎక్కువకాలం బతుకుతారు. స్ట్రాంగ్ బాండ్స్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే మంచిది. జబ్బులు కూడా తక్కువ వస్తాయట.
రోజూ నవ్వితే స్ట్రెస్ తగ్గుతుంది. హెల్తీగా ఉంటారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఫోన్ చూడడం తగ్గిస్తే కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. స్ట్రెస్ దూరమవుతుంది. మీ భంగిమ సెట్ అవుతుంది. ప్రొడెక్టివిటీ పెరుగుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాలి." అంటూ తెలిపారు. ఈ సింపుల్ టిప్స్ మీ డైలీ లైఫ్‌లో భాగమైతే... డాక్టర్ అవసరం మర్చిపోతారు. కాబట్టి ఈ సింపుల్ టిప్స్‌ని ఫాలో అయిపోండి.