Thyroid Diet Foods to Avoid : థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వైద్యులు సూచించే మందులు రెగ్యులర్‌గా వేసుకోవాలి. అంతేకాకుండా వాటితో పాటు కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. డైట్లో ఈ మార్పులు చేయకుంటే మీరు మందులు వాడినా పెద్ద ఫలితం ఉండదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటిని తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా
థైరాయిడ్ ఉన్నవారు సోయా ప్రొడెక్ట్స్ తినకూడదట. ఎందుకంటే సోయాలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం.. "అధిక సోయా లెవోథైరాక్సిన్ (థైరాయిడ్ హార్మోన్ భర్తీ) ప్రభావాన్ని అడ్డుకుంటుందని" తెలిపింది. మీరు థైరాయిడ్ మందులు తీసుకుంటుంటే వీటిని పూర్తి అవాయిడ్ చేయాలి అంటున్నారు నిపుణులు.
బ్రకోలి
క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలీ, కాలే వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పచ్చివి అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో అయోడిన్ తీసుకోవడం నిరోధించే గైట్రోజెన్లు ఉంటాయి. అయోడిన్ లోపం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఉడికించి తీసుకుంటే గైట్రోజెనిక్ ప్రభావం తగ్గుతుందట.
గ్లూటెన్
గ్లూటెన్‌కు చెందిన గోధుమ, బార్లీ వంటివాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. జర్నల్ ఆఫ్ థైరాయిడ్ రీసెర్చ్‌లోని ఓ అధ్యయనం ప్రకారం.. "గ్లూటెన్ లేని ఆహారాలు కొంతమందిలో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ రోగులలో మంచి ఫలితాలు ఇచ్చినట్లు" తేలింది. కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది.
ప్రాసెస్డ్ ఫుడ్స్
ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి. లేదంటే బీపీ సమస్య పెరుగుతుంది. ఎక్కువ సాల్ట్ పరిస్థితిని ఇంకా విషమం చేస్తుంది. అందుకే చాలామంది ఎండోక్రినాలజిస్ట్‌లు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తారు.
స్వీట్స్
థైరాయిడ్ మెటబాలీజంను తగ్గించేస్తుంది. కాబట్టి స్వీట్‌ను ప్రాసెస్ చేయడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు. కాబట్టి వీలైనంత వరకు షుగర్స్ అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
ఫ్యాటీ ఫుడ్స్
థైరాయిడ్ మందులు ప్రభావాన్ని ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించేస్తాయి. శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచుతాయి. ఇప్పటికే హైపోథైరాయిడిజంతో ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత ప్రమాదకరంగా మారతాయి.
కెఫిన్
కెఫిన్ కూడా థైరాయిడ్ మెడికేషన్‌ని అబ్జార్వ్ కానివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకే వైద్యులు మెడిసన్స్ వేసుకున్న 30 నుంచి 60 నిమిషాల వరకు కెఫిన్ తీసుకోవద్దని చెప్తారు.
ఇవే కాకుండా టోఫు, పల్లీలు కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెప్తున్నారు. వైద్యుల సూచనలు కచ్చితంగా ఫాలో అవుతూ.. ఫుడ్‌లో ఈ మార్పులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.