Bengaluru Crime News:  టెకీల మానసిక పరిస్థితిపై ఉద్యోగ ఒత్తిడి,కుటుంబ వ్యవహారాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్లుగానే ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన టెకీ ఒకరు తన భార్యను చంపేసి.. రాత్రంతా ఆమెతో మాట్లాడుతూ గడిపేశాడు. ఆమె చనిపోయినా.. ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. 

రాకేష్ రాజేంద్ర ఖేడేకర్  అనే వ్యక్తి పూణె నుంచి బెంగళూరు ఉద్యోగ నిమిత్తం వచ్చాడు. అతని భార్య పేరు గౌరీ. ఇద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆయితే రెండు రోజులకిందట వారి ఇంట్లో గౌరీ ఖేడేకర్ మృతదేహాన్ని చుట్టుపక్కల వారు గుర్తించారు. ఆమెను చంపేసి సూట్ కేసులో కుక్కేశారు.  రాకేష్ ఖేడేకర్ తన భార్య గౌరీ అనిల్ సాంబ్రేకర్ (32) ను కత్తితో పొడిచి చంపిన తర్వాత .. రాత్రంతా ఆమె శరీరం పక్కనే ఉండి, వారి తగాదాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.  

మహారాష్ట్రకు చెందిన ఖేడేకర్, హిటాచీ సిస్టమ్స్ ఇండియాలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రం  హోం చేస్తున్నారు. గౌరి గతంలో పుణెలో ఉద్యోగం చేసేవారు. భర్తతో బెంగలూరు వచ్చేసిన తర్వాత ఉద్యోగం వెదుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం కనిపించడం లేదు. ఇది ఆమెకు తీవ్ర అసహనానికి కారణం అయింది. వర్క్ ఫ్రం హోం జాబ్ కాబట్టి పుణె వెళ్లిపోదామని భర్తతో ఆమె గొడవ పడుతూ వస్తోంది. ఆయితే రాకేష్ మాత్రం బెంగళూరులోనే ఉందామని పట్టుబడుతున్నాడు.   

ఈ క్రమంలో  మార్చి 26 రాత్రి, భోజనానికి ముందు జంట ఇదే విషయంపై గొడవ పడ్డారు. ఖేడేకర్ గౌరీని ఆవేశంలో కొట్టడంతో గొడవ పెద్దది అయింది.  ఆమె వంటగది కత్తిని భర్తపై విసిరేసింది. ఆ కత్తి  వల్ల స్వల్ప గాయం అయింది. కోపంతో, అతను కత్తిని పట్టుకుని ఆమె మెడపై అనేకసార్లు పొడిచాడని పోలీసులు తెలిపారు. గౌరీ గాయాలతో మరణించిన తర్వాత, ఖేడేకర్ ఆమె శరీరం పక్కనే కూర్చుని, రాత్రంతా దానితో మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం, అతను ఆమె మృతదేహాన్ని ట్రాలీ సూట్‌కేస్‌లో ఉంచి  ఇంటికి తాళం వేసి పూణేకు బయలుదేరే ముందు బాత్రూంలో ఉంచాడు.

పూణే చేరుకున్న తర్వాత, అతను విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హత్యకు సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఒత్తిడితోనే ఈ హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.  

ఇటీవలి కాలంలో కుటుంబసమస్యల కారణంగా భార్య  లేదా భర్తలు  ఆత్మహత్యలు చేసుకోవడం...లేదా హత్యలు చేయడం వంటివి కామన్ గా మారుతున్నాయి. వైరల్ అవుతున్నాయి.  ఇలాంటి సమయంలో  టెకీ  బార్యను చంపి.. ఆమె చనిపోయిందని తెలిసి కూడా.. తమ సమస్యల గురించి రాత్రంతా మాట్లాడిన వ్యవహారం ఒళ్ల గగుర్పాటుకు గురి చేసేలా ఉంది.