Lokesh congratulates 11 year old Akhil:  పదకొండేళ్ల వయసు అంటే మహా అయితే ఆరో తరగతి చదువుతూ ఉంటారు. లెక్కలు కుస్తీ పడుతూ ఉంటారు.కానీ ఆకెళ్ల అఖిల్ మాత్రం టెక్నాలజీని దున్నిపడేస్తున్నారు.  యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ లలో పాల్గొన్నాడు.                                    

పదకొండేళ్లకే అత్యంత క్లిష్టమైన టెక్ సర్టిఫికెట్ల పాస్ 

ఈ కుర్రవాడి టాలెంట్‌కు ఏపీ విద్యామంత్రి నారా లోకేష్ ముగ్దుడయ్యాడు. పిల్లవాడి తండ్రితో కలిసి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వారిని అభినందించారు.  

తెలుగు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే ప్రయత్నాల్లో విద్యా మంత్రి లోకేష్                    

విద్యా మంత్రిగా నారా లోకేష్ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు అవసరమైన మార్పులు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం సరైన కసరత్తు లేకుండా ప్రారంభించిన సీబీఎస్ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల విద్యార్థులు లక్షల మంది సరిగ్గా చదవలేక డ్రాపౌట్ అయ్యే పరిస్థితికి వచ్చారని గుర్తించడంతో వెంటనే.. మార్చేశారు. ఇప్పుడు ప్రతి శనివారం నో బ్యాగ్ డే వంటివి అమలు చేస్తున్నారు. అలాగే ప్రతి స్కూల్ లో భవిష్యత్ లో ఏ ఏ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయో.. ఆయా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.       

స్కిల్ శిక్షణలో ప్రసిద్ధ కంపెనీలను ఒప్పిస్తున్న నారా లోకేష్       

ఇప్పటికే వివిధ ప్రముఖ కంపెనీలతో శిక్షణ ఇప్పించేందుకు..స్కిల్ ట్రైనింగ్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. సిస్కో, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తెలుగు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నాయి. కింది స్థాయి నుంచి ఈ శిక్షణ సాగేలా చేయనున్నారు. విద్యతో పాటు ..విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాల్లో ముందుకు వెళ్లేలా వారికి అభిరుచి ఉన్న రంగాల్లో ప్రోత్సహించేందుకు అవసరమైన విధానమైన నిర్ణయాలు తీసుకునే దిశగా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న తనంలోనే టెక్నాలజీపై ఎంతో ఇష్టంతో.. పదకొడేళ్లకే అద్భుతాలు చేస్తున్న ఆకెళ్ల అఖిల్ గురించి తెలిసి అభినందించారు. అఖిల్ స్ఫూర్తిగా మరింత మంది తమకు ఇష్టమైన రంగాల్లో అధ్భుతాలు సాధించేందుకు ఈ సమావేశం ఉపయోగడుతుందని భావిస్తున్నారు.