Bengaluru Woman Abused: బెంగళూరులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న యువతి కోరమంగళలో గెట్ టుగెదర్‌ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడి నుంచి హెబ్బగొడిలోని తన ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అటుగా వస్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగింది. ఆ వ్యక్తే అత్యాచారం చేశాడు. ఆమెపై దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై నిఘా పెట్టిన పోలీస్ బృందాలు అన్ని చోట్లా తనిఖీలు చేపడుతున్నాయి. బాధితురాలి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు సేకరించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 


"తెల్లవారుజామున ఈ అత్యాచారం జరిగింది. యువతికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తే అత్యాచారం చేశాడు. ఆ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాం. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడాం. అన్ని వివరాలూ సేకరించాం. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. 5 బృందాలు ఇదే పనిలో ఉన్నాయి. త్వరలోనే నిందితుడిని తప్పకుండా అరెస్ట్ చేస్తాం"


- పోలీసులు


Also Read: Doctor Abused: డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై వేధింపులు, మద్యం మత్తులో వచ్చి దాడి చేసిన పేషెంట్