Bengaluru Murder Accused Suicide: బెంగళూరు వయాలీ కావల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన నేపాలీ మహిళ మహాలక్ష్మీ కేసులో నిందితుడుగా అనుమానిస్తున్న వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులకు నిందితుడు ఒడిషాలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు సమాచారం అందింది.


నిందితుడు సడోమా సూకిస్టిక్‌తో రగిలి పోయేవాడన్న పోలీసులు:


బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన మహాలక్ష్మీ కేసులో ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్న వ్యక్తి పేరు ముక్తి రంజన్‌ రాయ్‌. ఇతడి కోసం వెస్ట్‌ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. నేపాలీ వివాహిత మహాలక్ష్మితో సన్నిహితంగా ఉన్న వారిలో ఇతడ్నే మొదటి నుంచి పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. ముక్తి రంజన్‌ సడోమా సూకిస్టిక్‌ అనే వ్యాధితో రగిలి పోయేవాడని పోలీసుల విచారణలో తేలింది.


2019లో మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్‌తో కలిసి బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చింది.  హేమంత్‌దాస్ ఓ సెల్‌ఫోన్‌ షాప్‌లో పనికి కుదరగా, మహాలక్ష్మీ ఓ మాల్‌లో పనిచేస్తూ ఉండేది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది.  2023 వరకు కలిసి ఉన్న వీళ్లు, మహాలక్ష్మీ ఉత్తరాఖండ్‌కు చెందిన హెయిర్ డ్రస్సెర్ అష్రాఫ్‌తో సన్నిహితంగా మెలగడంతో హేమంత్ దూరం అయ్యాడు. బిడ్డను ఆర్నెళ్ల క్రితం భర్త దగ్గరే వదిలి మహాలక్ష్మీ ఒంటరిగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మీ నివసించే నేలమంగల్‌ ప్లాట్‌ గదిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులు  వచ్చి గది తలుపులు తెరవగా హత్యోదంతం వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు ముక్తిరంజన్ రాయ్‌ మహాలక్ష్మిని చంపిన తర్వాత ఆమెను 40 భాగాలుగా నరికి ప్రిఢ్జ్‌లో ఉంచి పారిపోయాడు.


సెప్టెంబర్ 2 లేదా 3న ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తొలుత భర్త హేమంత్‌దాస్‌తో పాటు స్నేహితుడు అష్రఫ్‌ను అనుమానించిన పోలీసులకు ఆధారాలు లభించలేదు. మహాలక్ష్మీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న సమాచారంపై పోలీసులు విచారణ సాగించారు. ప్రధాన నిందితుడు ముక్తిరంజన్‌ దాస్‌గా గుర్తించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ సహా ఒడిషాలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రక్ జిల్లాలో ముక్తి రంజన్ దాస్‌ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది.


కొద్ది రోజుల క్రితం నేలమంగళంలోని ప్టాల్‌లోని ఫ్రిడ్జ్‌లో గుర్తించ లేని స్థితిలో మహిళ శరీర భాగాలు లభ్యమవగా.. కర్ణాటక సర్కారు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టింది. చివరకు ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న ముక్తి రంజన్ రాయ్‌ ఆత్మహత్యతో విచారణలో అవరోధం ఏర్పడినట్లైంది. అయితే నిందితుడు ముక్తి రంజన్ రాయ్‌ ఆత్మహత్యకు సంబంధించి ఇంకా పోలీసులు ఏ విధమైన అధికారిక ప్రకటనా చేయలేదు.


Also Read: సీనియర్ సిటిజన్స్‌కు ఇండియన్ రైల్వే కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మీకు తెలుసా! 45 ఏళ్ల నుంచే మహిళలకు