Viral News: ఈ రోజుల్లో క్షణికావేశం చాలా విలువైన జీవితాన్ని నాశనం చేస్తుంది.  జీవితం గురించి అవగాహన లేకపోవడం... తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లల కోసం తపన, ఆర్థిక పరిస్థితి పిల్లలు తమ నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి.చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మెుబైల్​ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తున్నారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్​ కొనడానికి సంకోచిస్తున్నారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. అదే విధంగా తాజాగా ఓ సంఘటన జరిగింది.  కొత్త మొబైల్‌ ఫోన్‌ కొని ఇవ్వలేదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలో జిల్లాలో చోటుచేసుకుంది. 

ఫోన్ కోసం ఎదురు చూసి వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలో 18 ఏళ్ల యువతి కొత్త మొబైల్ ఫోన్ కొనలేక ఆత్మహత్య చేసుకుంది. షిటల్‌కుచి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నీలా బర్మాన్ నెలల తరబడి కొత్త ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'తరుణేర్ శ్వప్నో' పథకం ద్వారా ఆమెకు మూడు నెలల క్రితం ఆర్థిక సహాయం అందింది. కానీ ఆమె తండ్రి కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఆ నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించాడు.ఈ నిర్ణయం నీలాకు తీవ్ర బాధ కలిగించింది. ఆమె ఆ డబ్బుతో ఫోన్ కొనాలని ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కోసం నీలాకు ఉన్న కోరిక నెరవేరకపోవడంతో ఆమె మానసిక ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సరస్వతి పూజకు ముందు తాను ఫోన్ కొనాలనే కోరికను వ్యక్తం చేశానని ఆమె అక్క మౌషుమి చెప్పింది. ‘‘మా నాన్న ఆమెకు ఫోన్ కొనిస్తానని వాగ్దానం చేశాడు, కానీ ఆమె అతనిని నమ్మలేదు" అని మౌషుమి అన్నారు.

Also Read :KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

వెదురు తోటలో మృతదేహంఆదివారం సాయంత్రం నీలా మృతదేహం ఆమె ఇంటికి సమీపంలోని వెదురు తోటలో కనిపించడంతో విషాదకరమైన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపారు. ఈ సంఘటనపై స్వదేశ్ చంద్ర బర్మాన్ సహా పొరుగువారు, ఇతరులు విచారం వ్యక్తం చేశారు. "పదేపదే ఫోన్ అడిగి, అది అందకపోవడంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆమె ఈ విధంగా తన జీవితాన్ని ముగించుకోవడం బాధాకరం" అని స్వదేశ్ అన్నారు.

మహారాష్ట్రలో అలాంటిదేమహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని బిలోలి  మండంలం మినాకి గ్రామంలో స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఓంకార్ (16) అనే విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు .తన అన్నదమ్ములతో కలిసి లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న ఓంకార్.. సంక్రాంతి పండుగ నిమిత్తం ఇంటికి వచ్చాడు. తండ్రి వ్యవసాయం, పేదరికం, అప్పుల గురించి ఏమీ ఆలోచించకుండా తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని పట్టబట్టాడు.పంట కోసం తీసుకున్న అప్పు.. పొలం పనుల కోసం తీసుకున్న బైక్ ఈఎఐ చెల్లించడానికే డబ్బు సర్దుబాటు కావడం లేదని తండ్రి కొడుకుకు చెప్పాడట. ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోవడం లేదనే డిజప్పాయింట్ మెంట్ తో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు.  

Also Read :Viral Video: ఇతను 2050లో పుట్టాల్సిన వ్యక్తి - ఈవీ కార్‌తో పూరీలు చేసేస్తున్నాడు !