Saree Inspiration from Celebrities : సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇలాంటి పండుగలతో పాటు.. పూజలు పునస్కారాలు.. పెళ్లిల్లు పేరంటాలు ఇలా సందర్భంలో అయినా అమ్మాయిలు ట్రెడీషనల్​గా ముస్తాబయ్యేందుకు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా స్పెషల్ అకేషన్స్​లో చీరను కట్టుకుంటారు. అయితే పండుగ ఏదైనా, ఫంక్షన్ ఎప్పుడైనా, పూజలు ఏమి చేసినా మీరు చీరను కట్టుకోవాలంటే పెద్ద ఆలోచించకండి. ట్రెడీషన్​లో ట్రెండ్​ని మిక్స్​ చేస్తూ.. ఈ సెలబ్రెటీల లుక్​ని ఫాలో అయిపోండి. 


సోనాలి బింద్రే 
Celebrity Saree Styles : పండుగలు, పూజలు, ఫంక్షన్లు సెలబ్రేషన్ ఏది అయినా శారీ కట్టుకోవాలనుకుంటే ఈ సెలబ్రెటీల లుక్స్ ఫాలో అయిపోండి


మురారి ముద్దు గుమ్మ సోనాలి బింద్రే మాదిరి మీరు శారీ లుక్ ట్రై చేయవచ్చు. వీ నెక్ బ్లౌజ్​ని ఇలాంటి కాంబినేషన్​ చీరతో సెట్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ పల్లు వేసుకుంటే లుక్ మరింత బాగుంటుంది. పూసల నెక్​పీస్​ లుక్​ని మరింత ఎలివేట్ చేస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. మీకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్ వేసుకుంటే ఫంక్షన్​కైనా, పూజకైనా మీరు స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా సోనాలి ఈ లుక్​లో రెడీ అయ్యింది.


శివాత్మిక


మీరు కాలేజ్ చదివే అమ్మాయి లేదా జాబ్ చేసే అమ్మాయి అయితే శివాత్మిక లుక్​ ట్రై చేయవచ్చు. చక్కగా నేత చీర కట్టుకుని.. దానికి మ్యాచింగ్ బ్లౌజ్​ వేసుకుని.. సింపుల్ జడ వేసుకుంటే సరి. ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకపోయినా.. సహజమైన మేకప్ లుక్​లో మీరు చాలా అందంగా కనిపిస్తారు. 


అమలా పాల్


మీకు పింక్ కలర్ శారీ కట్టుకోవాలనుకుంటే అమలా పాల్ శారీ లుక్స్​ని ట్రై చేయవచ్చు. పింక్ శారీకి గోల్డెన్ కలర్ బ్లౌజ్ మంచి లుక్ ఇస్తుంది. ఈ కాంబినేషన్ ట్రై చేస్తే.. గోల్డెన్ జ్యూవెలరీ పెట్టుకుంటే లుక్​ పర్​ఫెక్ట్​గా ఉంటుంది. ఫంక్షన్, పూజకు కావాల్సిన లుక్​ మీకు వచ్చేస్తుంది. హెయిర్ లీవ్ చేసి.. చీరను ఇలా కట్టుకుంటే ట్రెడీషనల్​గా, ట్రెండీగా కూడా కనిపిస్తారు. 


కీర్తి సురేశ్


కొత్తగా పెళ్లైన జంటలు చిలకాకు పచ్చ చీర కట్టుకుంటే చాలా బాగుంటారు. దానికి పింక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ డెడ్లీగా ఉంటుంది. ఈ లుక్​కోసం మీరు కీర్తి సురేశ్​ని ఫాలో అవ్వొచ్చు. కొప్పు పెట్టుకుని పూలతో అలంకరించుకుంటే లక్ష్మీ దేవి కళ మీ దగ్గర ఉట్టిపడుతుంది. 


రుహాని శర్మ 


మీరు ఫంక్షన్లు ఉన్నా.. పూజలు ఉన్నా.. పెళ్లి అయినా.. ఎలాంటి అకేషన్​కి అయినా ఈ కేరళ స్టైల్ లుక్​ పర్​ఫెక్ట్ ఉంటుంది. ఈ గ్లోయింగ్, క్లాసీ లుక్​ కోసం రుహానీ శర్మను ఫాలో అవ్వొచ్చు. వైట్ శారీ, గోల్డెన్ అంచుతో వచ్చే ఈ తరహా శారీలు ఎలాంటి సాంప్రదాయ వేడుకకు అయినా ఇట్టే సెట్ అయిపోతాయి. శారీకి తగ్గట్లు గోల్డెన్, పసుపు, డార్క్ గ్రీన్ ఇలా మీకు నచ్చిన పర్​ఫెక్ట్ బ్లౌజ్ సిద్ధం చేసుకుంటే చాలు. మినిమల్ జ్యూవెలరీతో ఎలాంటి మేకప్​ లేకపోయినా మీ లుక్​ హైలైట్​గా ఉంటుంది. 


అనసూయ భరద్వాజ్


కాటన్ చీర లేదా నేత చీర కూడా మీకు మంచి లుక్​ని ఇస్తుంది. పండుగలకు, ఫంక్షన్లకు కూడా ఇది బాగా సెట్ అవుతుంది. సింపుల్​గా కనిపిస్తూనే హుందా లుక్​ మీ సొంతం కావాలంటే అనుసూయ మాదిరిగా రెడీ అవ్వొచ్చు. ఈ తరహా లుక్​కి హెవీ జ్యూవెలరీ కూడా అవసరం ఉండదు. 


మీనా


పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు నిండుగా.. జ్యూవెలరీతో కనిపించాలనుకుంటే.. మీనాను ఫాలో అయిపోవచ్చు. అందంగా చీరకట్టుకుని.. సింగిల్ పైట వేసుకుని.. భారీ హారం వేసుకుని.. చేతులకు గోల్డెన్ జ్యూవెలరీ, పాపిడి బిళ్ల, ఇయర్ రింగ్స్​తో మీ లుక్​ని ఫైనల్ చేసుకోవచ్చు. 


ఐశ్వర్య లక్ష్మి


సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపించాలనుకునేవారు ఐశ్వర్య లక్ష్మి లుక్​ని ట్రై చేయవచ్చు.  ఫుల్​ నెక్​తో వచ్చిన బ్లౌజ్​ని స్లీవ్స్​ లేకుండా ట్రెండీగా మార్చుకుని మ్యాచింగ్ శారీ కట్టుకుంటే సరి. చేతికి గాజులు వేసుకుని.. ఇయర్ రింగ్స్ కుంకుమతో అదిరిపోయే లుక్​ని మీ సొంతం చేసుకోవచ్చు. 


శ్రీనిధి శెట్టి


రెడ్ కలర్ శారీ అటు పండుగలకు, ఇటు ఫంక్షన్లకు ఎలాంటి ఈవెంట్స్​కి అయినా ఇట్టే సెట్ అయిపోతుంది. ఈ లుక్​లో మీరు ఎక్కువగా రెడీ కాకపోయినా అందంగా కనిపిస్తారు. సింపుల్ మేకప్ లుక్​లో వెళ్లినా.. గ్రాండ్​గా ముస్తాబైనా చాలా అందంగా కనిపిస్తారు. శ్రీనిధి శెట్టి మాత్రం సింపుల్​గానే ముస్తాబైంది. 



Also Read : హల్దీ ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు.. ట్రెడీషనల్​ లుక్​లో రెడీ అవ్వాలంటే సాయి పల్లవిని ఫాలో అయిపోండి