టాలీవుడ్ కమెడియన్ కం నిర్మాత బండ్ల గణేష్‌పై ఎన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయో లెక్కే లేదు. ఆయన గతంలో అనేక సార్లు చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. మరోసారి 
 ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేశారు.తనపై కావాలనే కొంతమంది వ్యక్తులు కేసులు వేశారని బండ్ల గణేష్ కోర్టు వద్ద తెలిపారు. గతంలో కూడా పలు మార్లు చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్ట్ కు హాజరయ్యారు.  


కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్


టాలీవుడ్‌కు ఫైనాన్స్ చేసే వారిలో ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. మినీ ముంబైగా ప్రొద్దుటూరు ప్రసిద్ది చెందింది. అక్కడి వడ్డీ వ్యాపారం అంతా గోప్యంగా సాగిపోతూ ఉంటుంది. సాధారణంగా సినిమా నిర్మాతలకు ఇచ్చే అప్పులకు ఓ లెక్క ఉంటుంది. అన్నీ క్లియర్ చేస్తేనే ల్యాబ్‌లో సర్టిఫికెట్ ఇస్తారు. కానీ బండ్ల గణేష్ ప్రొద్దుటూరు వడ్డీ వ్యాపారుల నుంచి సినిమా పేరుతో .. సినిమాకు సంబంధం లేకుండా అప్పు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. సినిమా రిలీజైనా వాటిని చెల్లించకపోవడంతో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. 


పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్


బండ్ల గణేష్‌పై వడ్డీ వ్యాపారులు ఉన్న ప్రతీ చోటా దాదాపుగా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. పలు జిల్లాల్లో చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. ప్రకాశం, గుంటురుతో పాటు పలు ప్రాంతాల్లో కేసులకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు ఓ సారి అరెస్ట్ చేశారు కూడా. అదే సమయంలో ఆయనపై ఇండస్ట్రీలోనూ అనేక వివాదాలు ఉన్నాయి. ముంబైకు చెందిన సచిన్ జోషి అనే వ్యాపారవేత్త తెలుగులోహీరోగా సినిమాలు చేశారు. ఆయన కూడా బండ్ల గణేష్ మోసం చేశారని కేసులు పెట్టారు.  వివాదాలు కూడా కోర్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. 


కమెడియన్‌గా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ హఠాత్తుగా నిర్మాత అవతారం ఎత్తారు. అదీ కూడా భారీ చిత్రాల నిర్మాతగా మారారు. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి వారితో సినిమాలు తీశారు. పవన్ కల్యాణ్‌ను పొగడటంలో ఆయనది ప్రత్యేక శైలి. అటు ఆర్థిక వివాదాల్లోనూ.. ఇటు ఇండస్ట్రీ వివాదాల్లోనూ ఆయన పేరు తరచూ నలుగుతూ ఉంటుంది.