APSRTC Bus in Konaseema District: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు కూలీలను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రహదారి పక్కన  ట్రాక్టర్ పైకి ధాన్యం బస్తాలు ఎక్కిస్తుండగా.. కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దారు.


రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతుల్లో ముగ్గురు జి.పెద్దపూడి, మరొకరు ఆదిమూలవారిపాలెం నివాసులుగా పోలీసులు గుర్తించారు.