Minister Savitha Helped Accident Victims In Tenali: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తోన్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించి.. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


అటు, చిత్తూరు జిల్లాలోనూ టాటా ఏస్ వాహనం బోల్తా పడి ప్రమాదం జరిగింది. చౌడేపల్లి మండలం కరణంవారిపల్లె వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు సహా 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బోయకొండ గంగమ్మ దర్శనార్థం వి.కోట నుంచి భక్తులు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Mangalagiri: తెనాలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం - కాన్వాయ్ ఆపి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి సవిత


Also Read: Nandyal News: బాలిక ఆచూకీపై వీడని సస్పెన్స్ - పూటకో మాట చెబుతున్న నిందితులు, కొనసాగుతోన్న గాలింపు