Ankita Bhandari Murder Case:
తప్పుదోవ పట్టించే ప్రయత్నం..
ఉత్తరాఖండ్‌లో భాజపా నేత కొడుకు దారుణ హత్య చేశాడు. యమకేశ్వర్ బ్లాక్‌లో తన రిసార్ట్‌లో పని చేస్తున్న 19 ఏళ్ల రెసిప్షనిస్ట్ అంకిత భండారిని హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. భాజపా నేత కుమారుడితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. హరిద్వార్‌లోని భాజపా నేత వినోద్ ఆర్య కొడుకు పుల్‌కిత్ ఆర్య ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆయనతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తానూ అదుపులోకి తీసుకున్నారు. యువతిని చంపిన తరవాత చీలా కెనాల్‌లో మృతదేహాన్ని పడేసినట్టు అంగీకరించారు. ఉత్తరాఖండ్ మాటికళా బోర్డ్ చైర్మన్‌గా గతంలో పని చేశాడు పుల్‌కిత్ ఆర్య. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. ఆ క్యాడర్ కూడా వచ్చింది. అయితే...ప్రస్తుతం ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. అయితే...ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు పుల్‌కిత్ ఆర్య. పౌరీ గర్వాల్‌లో ఉండే ఆ యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టాఫ్‌తో కలిసి పుల్‌కిత్ ఆర్య ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.
మృతదేహం గుర్తింపు
నిందితులు చెప్పిన వివరాల ప్రకారం రిషికేష్‌లోని చీలా కెనాల్‌లో మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు చివరకు డెడ్‌బాడీని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు..ఆ మృతదేహాన్ని చూసి నిర్ధరించారు. "మృతురాలి సోదరుడు, తండ్రి డెడ్‌బాడీని గుర్తుపట్టారు. ఆమేనని ధ్రువీకరించారు. బ్యారేజ్ వద్ద అంకిత్ భండారి మృతదేహం లభించింది" అని పోలీసులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచే గాలింపు మొదలు పెట్టారు. రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు మృతదేహాన్ని తరలించారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రిషికేష్‌లో పుల్‌కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చివేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధికారులు ఆ రిసార్ట్‌ను కూల్చేశారు. అక్రమంగా నడుస్తున్న రిసార్ట్‌లు
అన్నింటి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.