అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (AP Government Employees Retirement Age) 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇవి తమకు కూడా వర్తిస్తాయని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు భావించారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో క్లారిటీ ఇచ్చింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ఉత్తర్వులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు (Retirement Age Extension) వర్తించదు. ఆయా సంస్థలు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు అని ఉత్తర్వులు ఇవ్వడం తగదని ఈ కంపెనీలకు రాష్ట్ర ఆర్థికశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి ఉత్వర్వులు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తాజా ఉత్తర్వులలో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రిటైర్మెంట్ వయసు పెంపు ఉత్వర్వులకు సంబంధించి నివేదికను పంపాలని కూడా ఆయా సంస్థలకు నిర్దేశించింది.

విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో 104 పోస్టులు 
విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతులన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు:  
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 55     

2) టెక్నీషియన్ డిప్లొమా, అప్రెంటిస్: 49     
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్. 
అర్హతలు: డిప్లొమా/డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.     

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.     

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది
(NATS పోర్టల్)
21.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది
(హిందూస్థాన్ షిప్‌యార్డ్ పోర్టల్)
26.09.2022
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ర్యాంక్ జాబితా వెల్లడి 28.09.2022