అనంతపురం జిల్లా కదిరిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిరోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్న కుమార్తెను కళాశాల నుంచి ఇంటికి తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. 


మానసిక ఇబ్బందులు


ఇంకో రెండేళ్లలో కుమార్తెను వైద్యురాలిగా చూస్తామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరిలోని రైల్వే స్టేషన్​రోడ్డులో నివాసం ఉంటున్న జైనుల్లా, మహబూబ్ చాంద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి పెద్ద కుమార్తె రాఫియా అంజుమ్. అంజుమ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సం చదువుతుంది. అంజుమ్ తండ్రి గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారినపడి మంచానికే పరిమితమయ్యారు. మూడు నెలలుగా రాఫియా అంజుమ్ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె తల్లి మహబూబ్ చాంద్ తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న రాఫియా తరచూ మాత్రలు వాడేదని తెలిపారు. మాత్రలు వద్దని వారించినా వినిపించుకునేదికాదన్నారు. కుమార్తె పరిస్థితిని గుర్తించిన ఆమె నెల రోజుల క్రితం తిరుపతి నుంచి కదిరిలోని తమ ఇంటికి తీసుకువచ్చామని చెప్పారు. 


Also Read: FD Interest Rates: చిన్న బ్యాంకులే.. కానీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు అదుర్స్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కంటే అధిక వడ్డీ మీ సొంతం


Also Read: Guntur News: హెయిర్ కట్టింగ్ విషయంలో గొడవ... స్నేహితుడి మెడపై కత్తెరతో దాడి


ఫ్యాన్ కు ఉరి వేసుకుని


శనివారం ఉదయం రాఫియా తల్లి విధులకు వెళ్లారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె సోదరి స్కూల్ కు వెళ్ళింది. తండ్రితో పాటు ఇంట్లో ఉన్న రాఫియా అంజుమ్ మధ్యాహ్నం తండ్రికి మాత్రలు ఇచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె తల్లి తలుపులు తెరిచి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి విలపించింది. అప్పటికే అంజుమ్ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.


 


Also Read: Vizag-Vizianagaram Twin Cities: విశాఖ-విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి... విశాఖలో వెయ్యి పార్కులు... ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు


Also Read: Viral Video: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం... రోడ్డుపై కొట్టుకున్న వైద్యుడు, మహిళ