ఇద్దరి స్నేహితుల మధ్య హెయిర్ కట్టింగ్ విషయంలో మొదలైన గొడవ ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దారితీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవానీనగర్​లో శనివారం ఇద్దరి స్నేహితుల మధ్య హెయిర్ కట్టింగ్ విషయంలో ఘర్షణ జరిగింది. సూరగాని ఆంజనేయులు తండ్రి శ్రీనివాసరావుతో కలిసి కటింగ్ చేయించుకునేందుకు హెయిర్ కటింగ్ షాపుకు వచ్చాడు. అక్కడే ఉన్న స్నేహితుడి తండ్రి చల్లా శ్రీనివాసరావు హెయిర్​ కటింగ్ మంచిగా చేయించుకోవాలని ఆంజనేయులితో అన్నాడు. నవ్వేంటి నాకు చెప్పేదని కోపంతో ఆంజనేయులు చల్లా శ్రీనివాసరావుపై దాడి చేసి చెంపపై కొట్టాడు.      


 
ఈ సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు కొడుకు నాగేంద్రబాబు తన తండ్రినే కొడతావా అంటూ స్నేహితుడితో ఘర్షణకు దిగాడు. నువ్వేంట్రా నాకు చెప్పేదంటూ ఆంజనేయులు ఎదురుదాడికి పాల్పడ్డాడు. కోపం ఎక్కువై పక్కనే ఉన్న కత్తెర తీసుకొని నాగేంద్రబాబు మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగేంద్రబాబును పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చల్లా శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Also Read: FD Interest Rates: చిన్న బ్యాంకులే.. కానీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు అదుర్స్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కంటే అధిక వడ్డీ మీ సొంతం


వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలు, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావుకు గాయాలయ్యాయి. పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది. 


తాడిపత్రిలో వైసీపీ నేత హత్య


అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత పోతులయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం పెన్నా నదిలో పోతులయ్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి వాసిగా పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోతులయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పోతులయ్యను చంపి పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాడిపత్రిలో మళ్లీ రాజకీయ హత్యలు మొదలవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుకున్నారు. 


 


Also Read: Viral Video: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం... రోడ్డుపై కొట్టుకున్న వైద్యుడు, మహిళ