Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఓ నిందితుడు బీభత్సం సృష్టించాడు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. పోలీసు స్టేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే బ్లేడుతో పోలీసులపై దాడి చేశాడు. అనంతరం అదే బ్లేడుతో తన మెడపైనా గాట్లు వేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిహత్నూర్ కు చెందిన అరుణ్ అనే వ్యక్తి.. 17 ఏళ్ల బాలికను సోమవారం ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆమెను రక్షించారు. మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.
బుధవారం సదరు యువకుడిని పోలీసులు పిలవగా, ఇంటి నుంచి బ్లేడుతో వచ్చిన యువకుడు రిమాండ్ కు తరలిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న పోలీసులపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం తన మెడపై తానే కోసుకున్నాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అతడిని పట్టుకున్నారు. గాయపడ్డ ఆ ఇద్దరిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న పోలీస్ ఉద్యోగిపై హత్యాయత్నం చేసినందుకు మరో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్ ట్రైనర్
మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశారు జిమ్ ట్రైనర్ ఉపేందర్. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలలం రేపింది. మల్లికార్జున్‌నగర్‌లో కొత్తగా కడుతున్న ఇంటికి బాలిక తల్లిదండ్రులు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అయితే.. సోమవారం పనిమీద బయటకువెళ్లారు. ఇంటి దగ్గర బాలిక ఒక్కటే ఉంది. ఇంటి బయట ఆడుకుంటోంది. అదే కాలనీలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఉంపేదర్ బాలికను గమినించాడు.
ఒంటరిగా ఉండటం చూసి.. ఎలాగైనా లోబరుచుకోవాలని ప్రయత్నించారు. చిన్నారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఆశ పెట్టాడు. జిమ్‌లోకి తీసుకెళ్లాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా... చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని వయస్సు ఆ చిన్నారిది. అయినా రెచ్చిపోయాడు కామాంధుడు ఉపేందర్. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
ఇంతలో ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు... ఇంట్లో బాలిక లేకపోవడంతో అంతా వెతికారు. ఎక్కడా లేకపోవడంతో కంగారుపడ్డారు. అనుమానం వచ్చి పక్కనే ఉన్న జిమ్‌లోకి వెళ్లారు. అక్కడ బాలిక ఏడుస్తూ ఉండటం గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా... బాలిక విషయం వారితో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. జిమ్ ట్రైనర్ ఉపేందర్(29)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. చిన్నారులను చిధిమేస్తున్న ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతాయని... కఠిన శిక్షలు పడితేనే... మరో ఇలాంటి ఘాతుకాలకు తెగబడరని అంటున్నారు.