Young Man Broke His Head In Warangal: యువతి చేతిలో మోసపోయానని ఓ యువకుడు భగ్న ప్రేమికుడిలా మారాడు. తన తలను తానే రక్తం వచ్చేలా పగలగొట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ (Warangal) నగరంలో ఆందోళన కలిగించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని హల్చల్ చేశాడు. గోడకు తన తలను రక్తం వచ్చేలా కొట్టుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని ఆపేందుకు యత్నించినా వినలేదు. ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీస్ యువకుడిని పట్టుకుని నిలువరించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. 


Also Read: Crime News: స్కూల్‌లో తీవ్ర విషాదం - చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి