Car catches fire on Hyderabad ORR | హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)పై మరో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై ఓ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. శామీర్‌పేట సమీపంలో ఓఆర్ఆర్‌పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు నుంచి బయట పడేందుకు వీలులేక పోవడంతో డ్రైవర్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హోం లోన్ చెల్లించలేదని ఒత్తిడి.. మహిళ ఆత్మహత్యమెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆదివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంటిపై తీసుకున్న హోం లోన్ చెల్లించాలంటూ ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్ నిర్వాహకుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురవ్వడంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి (35) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శివానందం తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు ఎనరెల్లి కృష్ణ భార్య. కృష్ణ కూలి పనులు చేసేవాడు. వరలక్ష్మి ఒక క్లాత్ స్టోర్‌లో పనిచేసేది.
కొన్ని నెలల కిందట కృష్ణ, వరలక్ష్మి దంపతులు తమ ఇంటిపై ఒక ప్రైవేట్ బ్యాంకులో, ఇతర ఫైనాన్స్ కంపెనీలలోలోన్ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు గడువులోపు ఈఎంఐలను చెల్లించలేకపోయారు. ఆదివారం ఉదయం, బ్యాంకు, ఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికి వచ్చి, బకాయిలు పూర్తిగా చెల్లించాల్సిందేనని చెప్పారు. లేకపోతే నోటీసులిచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి, తూప్రాన్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మృతురాలి భర్త కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.