A Tragic Incident In Hanmakonda: హనుమకొండలో (Hanmakonda) దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురితో ఉన్న ఓ యువకుడిని చూసి ఆ తండ్రి ఆగ్రహంతో అతనిపై దాడి చేశాడు. యువకుడి గొంతు కోశాడు. ఇది తట్టుకోలేని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో (Gopalpur) జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ నగరం గోపాల్‌పూర్‌లో భరత్ అనే యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఓ బాలికను కలిసేందుకు వచ్చాడు. తన ఇంట్లో ఇరువురూ కలిసి ఉండడం చూసిన బాలిక తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతను గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. అయితే, బాలిక తండ్రి యువకుడి గొంతు కోశాడు.
బాలిక ఆత్మహత్య
ప్రియుడి గొంతు కోయడం చూసిన బాలిక అవమానంతో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భరత్ కుటుంబం పోచమ్మ మైదాన్‌లో నివాసం ఉంటుండగా.. అతని తండ్రి ఎల్ఐసీ ఏజెంట్ కాగా, తల్లి అంగన్వాడీ టీచర్. భరత్ హైదరాబాద్‌లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. బాలిక తండ్రి హన్మకొండలో ఓ ప్రైవేట్ చిట్ ఫండ్‌లో పని చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Meerpet Murder Case: భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?