SCL: సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్‌ పోస్టులు- ఎంపికైతే రూ.81,100 వరకు జీతం, పూర్తి వివరాలివే!

SCL Jobs: సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

SCL Recruitment: పంజాబ్‌లోని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ(ఎస్‌సీఎల్) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 25 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌- 02 పోస్టులు, ఓబీసీ- 06 పోస్టులు, ఎస్సీ/ఎస్టీ- 06 పోస్టులు. 

* అసిస్టెంట్‌ (అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌) పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు ఎడ్యుకేషనల్/రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్/ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 26.02.2025 నాటికి 25 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 - 15 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.472.

ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం100 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్- ఎ, పార్ట్- బి రెండు భాగాలుగా విభజించారు. 
పార్ట్- ఎ: మొత్తం 40 మార్కులకు (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 20 మార్కులు, బేసిక్ నాలెడ్జ్కంప్యూటర్‌- 20 మార్కులు).
పార్ట్- బి: మొత్తం 60 మార్కులకు (జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ఎబిలిటీ- 20 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్- 20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్- 20 మార్కులు)
సమయం: 2 గంటలు.

పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ అండ్ చండీగఢ్/మొహాలి/పంచకుల.

జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

అభ్యర్థులు సమర్పించాల్సిన డాక్యుమెంట్‌లు..

➥ మెట్రిక్యులేషన్/సెకండరీ సర్టిఫికెట్.

➥ గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత సర్టిఫికెట్స్.

➥ ISO 9001 సర్టిఫైడ్ జారీ చేసిన కనీసం 120 గంటలు/03 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. (బీసీఏ, బీఎస్సీ(ఐటీ), బీటెక్(కంప్యూటర్ సైన్స్)) డిగ్రీ ఉన్న అభ్యర్థులు విడిగా కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం లేదు, అతను/ఆమె కంప్యూటర్ సర్టిఫికేట్ స్థానంలో సంబంధిత డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురావచ్చు.

➥ కాస్ట్/ కేటగిరీ సర్టిఫికేట్, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారైతే.

➥ దివ్యాంగ సర్టిఫికేట్ అవసరమైన ఫార్మాట్‌లో(వర్తిస్తే)

➥ ఎక్స్- సర్వీస్‌మెన్(ESM) కోసం: సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్Annexure-IV ప్రకారం(వర్తిస్తే), సాయుధ దళాల నుండి డిశ్చార్జ్ చేయబడితే, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఏదైనా వయో సడలింపు కోరుకుంటే సంబంధిత సర్టిఫికెట్.

➥ కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ కేంద్రపాలిత ప్రాంతం/ ప్రభుత్వ రంగ సంస్థలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు మొదలైన వాటిలో ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే సంబంధిత యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్.

➥ వివాహం లేదా పునర్వివాహం లేదా విడాకులు మొదలైన వాటి కారణంగా మెట్రిక్యులేషన్ తర్వాత పేరు మార్పును క్లెయిమ్ చేసే అభ్యర్థి ఈ క్రింది పత్రాలను సమర్పించాలి:
i. మహిళల వివాహం విషయంలో: భార్యాభర్తల పేర్లను చూపించే భర్త పాస్‌పోర్ట్ ఫోటోకాపీ లేదా వివాహ రిజిస్ట్రార్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరణ నకలు, ఓత్ కమీషనర్ ముందు ప్రమాణం చేసిన జాయింట్ ఫోటోతో పాటు భార్యాభర్తల నుండి అఫిడవిట్.
ii. స్త్రీల పునర్వివాహం విషయంలో: మొదటి జీవిత భాగస్వామికి సంబంధించి విడాకుల దస్తావేజు/ మరణ ధృవీకరణ పత్రం; మరియు జీవిత భాగస్వామి పేర్లను చూపించే ప్రస్తుత భర్త పాస్‌పోర్ట్ ఫోటోకాపీ లేదా వివాహ రిజిస్ట్రార్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ లేదా భార్యాభర్తల నుంచి ఒక అఫిడవిట్‌తో పాటు ఓత్ కమీషనర్ ముందు ప్రమాణం చేసిన జాయింట్ ఫోటో.
iii. మహిళల విడాకుల విషయంలో: విడాకుల డిక్రీ మరియు డీడ్ పోల్ సర్టిఫైడ్ కాపీ, ఓత్ కమీషనర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్.

➥ DV కోసం అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న ఏదైనా ఇతర సర్టిఫికేట్‌లు.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2025.

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.02.2025. సమయం-11.59 (P.M.)

✦ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28.02.2025. సమయం-11.59 (P.M.)

✦ రాత పరీక్ష యొక్క తాత్కాలిక నెల:  మార్చి 2025

Notification

Online Application

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement