Bihar Saharsa News: ఈరోజుల్లో దేశంలో రోడ్డు ప్రమాదాలు లాంటి దుర్ఘటనలు పెరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా అలాంటిదే బిహార్ లో ఓ ఘటన జరిగింది. బిహార్ లోని సహర్సాలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఒక జంటను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆ జంట అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన తరువాత వృద్ధుడి మృతదేహం కారుకు అటాచ్ అయి ఇరుక్కుపోయింది.

బిహార్ పోలీసులు తెలిపిన ప్రకారం.. వృద్ధ దంపతులను బిహార్ లోని సహర్సాలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ వృద్ధుడి మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచాడు. ఆపై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి వృద్ధుడి మృతదేహాన్ని గొయ్యి తీసి పాతిపెట్టాడు.  ప్రస్తుతం, నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

100 మీటర్ల దూరంలో భార్య మృతదేహం ఆ జంట మార్నింగ్ వాక్ కోసం తమ ఇంటి నుండి బయటకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. కొంత సమయానికే వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని ప్రమాదం జరిగిన చోటు నుంచి 100 మీటర్ల దూరంలో గుర్తించారు. ఆమె భర్త ఆచూకీ కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో త రెండవ రోజు వృద్ధుడి మృతదేహం ప్రమాదం జరిగిన స్థలానికి చాలా దూరంలో గుర్తించారు. సిసిటివిలో రికార్డైన దృశ్యాల సహాయంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి సీజన్ చేశారు. ప్రమాదం చేసిన ఆ డ్రైవర్ ఆ వృద్ధుడ్ని 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఫ్రెండు సహాయంతో డెడ్ బాడీ పూడ్చి..

చాలా దూరం తీసుకెళ్లిన తరువాత స్నేహితుడి సహాయంతో నిందితుడు ఆ వృద్ధుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడంలో నిందితుడికి సాయం చేసిన స్నేహితుడు సునీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు కారణమైన డ్రైవర్ కేశవ్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. మృతులను శ్యామా దేవి, ఆమె భర్త భరత్ రామ్ (60) గా సహర్సా పోలీసులు గుర్తించారు.