Tata Harrier EV Price, Down Payment, Loan and EMI Details: టాటా మోటార్స్, ఈ నెల 3న (03 జూన్ 2025), భారతదేశంలో టాటా హారియర్ EVని లాంచ్ చేసింది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు & అద్భుతమైన రేంజ్‌ను మిక్స్ చేసి ఈ కార్‌ను డిజైన్ చేశారు. అంటే, చాలా ఎక్కువ దూరం (సింగిల్ ఛార్జ్‌తో 627 km) ప్రయాణించే ఆధునిక సాంకేతికత కలిగిన ఎలక్ట్రిక్ వాహనం ఇది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న క్రెటా EV & మహీంద్రా XEV 9e వంటి కార్లకు పోటీగా టాటా హారియర్ EV వచ్చింది. పెట్రోల్ ఖర్చులు ఆదా చేసే అత్యాధునిక & దమ్మున్న ఎలక్ట్రిక్ కార్‌ను సొంతం చేసుకోవాలని మీరు భావిస్తుంటే, ఈ కథనంలోని వివరాలు మీకు ఉపయోగపడుతాయి.
మూడు వేరియంట్లుటాటా హారియర్ EV - "అడ్వెంచర్, ఫియర్‌లెస్ & ఎంపవర్డ్" (Adventur, Fearless & Empowered) అనే మూడు వేరియంట్లలో వచ్చింది. Tata Harrier EV Adventur అనేది ట్రిమ్ స్థాయుల్లో బేసిక్ మోడల్. Tata Harrier EV Fearless అనేది అడ్వెంచర్ ట్రిమ్ కంటే అప్‌గ్రేడ్ వెర్షన్. ఇక, Tata Harrier EV Empowered అనేది టాటా హారియర్ EV టాప్-ఎండ్ వేరియంట్.
తెలుగు రాష్ట్రాల్లో ధర టాటా హారియర్ EV బేసిక్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Harrier EV ex-showroom price) రూ. 21.49 లక్షలు. మీరు ఈ బండిని ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో కొనుగోలు చేయాలనుకుంటే.. ఆన్-రోడ్ ధరగా (Tata Harrier EV on-road price) రూ. 22.95 లక్షలు చెల్లించాలి.
కారు కొనడానికి ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? ఈ లగ్జరియస్, స్టైలిష్, మోడర్న్, స్ట్రాంగ్ & లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUVని మీరు కేవలం రూ.5 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనవచ్చు. మిగిలిన రూ.17.95 లక్షలను బ్యాంకు నుంచి కారు రుణంగా తీసుకోవాలి. బ్యాంక్ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. డౌన్ పేమెంట్ & వడ్డీ రేటు అంశాలు మీ క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర, బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటాయి.
EMI వివరాలు
5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా రుణం పొందితే, ప్రతి నెలా రూ. 37,261 EMI చెల్లించాలి. ఇలా మొత్తం 60 EMIలు చెల్లించాలి.
6 సంవత్సరాల కాలానికి లోన్ మంజూరు అయితే, ప్రతి నెలా రూ. 32,356 EMI చెల్లించాలి. ఇలా మొత్తం 72 EMIలు చెల్లించాలి.
7 సంవత్సరాల టెన్యూర్‌తో అప్పు తీసుకుంటే, ప్రతి నెలా రూ. 28,880 EMI చెల్లించాలి. ఇలా మొత్తం 84 EMIలు చెల్లించాలి.
మీ నెలవారీ ఆదాయం రూ.70,000 పైన ఉంటే, మీరు 6 లేదా 7 సంవత్సరాల కాల పరిమితితో లోన్ తీసుకునే ఆప్షన్ పరిశీలించవచ్చు.
టాటా హారియర్ EV లక్షణాలు & పరిధిటాటా హారియర్ EV డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో లాంచ్ అయింది. ఫ్రంట్ మోటార్ 158 PS (116 kW) & రియర్ మోటార్ 238 PS (175 kW) జనరేట్ చేస్తుంది. దీని మొత్తం టార్క్ 504Nm. బూస్ట్ మోడ్‌లో ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 km వేగాన్ని అందుకుంటుంది, ఈ లక్షణంతో ఇది అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది. టాటా హారియర్ EVని 65kWh & 75kWh బ్యాటరీ ఆప్షన్స్‌లో (Tata Harrier EV Battery options) కొనవచ్చు. కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జ్‌తో దాదాపు 627 km డ్రైవింగ్ రేంజ్ (Tata Harrier EV Range) అందిస్తుంది.
టాటా హారియర్ EVలో అధునాతన 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ ఉంది, దీనిలో 360-డిగ్రీల కెమెరా ట్రాన్స్‌పరెంట్ అండర్ బాడీ వ్యూతో ఉంటుంది, దీనితో కారు కింద భాగంలోని రోడ్డును కూడా మీరు చూడవచ్చు. ఈ ఫీచర్ మట్టి రోడ్లు & ఇరుకైన పార్కింగ్ స్థలాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.