Telangana News: తెలంగాణలో మూడు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. ఇందులో ముగ్గురు యువకులు ఉంటే మరో ఐదుగురు కూలీలు ఉన్నారు. ఈ ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన కూలీలు మృతి చెందారు. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని డీ కొట్టింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం వద్ద జరిగింది. ఐదుగురు స్పాట్‌లో చనిపోతే మరో పది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలోని కోర్హాపుట్ జిల్లాకు చెందిన 32 మంది హైదరాబాద్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. ఈ మధ్య ూరి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: తెలంగాణలో దారుణం - 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం, పగతో కోడలిని చంపి పాతేసిన అత్తమామలు


యువకుల ప్రాణం తీసిన అతి వేగం


మరో ప్రమాదం జగిత్యాల మండలం తక్కలపల్లి వద్ద జరిగింది. ముగ్గురు యువకుల బైక్‌లు డీ కొనడంతో ప్రమాదం జరిగింది. జాబితాపూర్ వాసులైన బత్తుల సాయి, అరవింద్ బంధువులకు తిరుపతి ప్రసాదం ఇచ్చి వస్తుండగా ప్రమాదం జరిగింది. అనంతారం– తక్కళ్లపల్లి మార్గ మధ్యలో మేడిపల్లి మండలం కొండాపూర్ వాసి దయాల వంశీ బైక్‌ను వీళ్లు వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో అరవింద్, వంశీ స్పాట్‌లోనే చనిపోయారు. సాయి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వంశీ వారం రోజుల క్రితమే గల్ఫ్‌ నుంచి వచ్చాడు. 


కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లి వస్తుండగా బలి తీసుకున్న లారీ 


సిద్దిపేటలో భార్యతో కలిసి వస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. దీంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయారు. కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కోహెడ మండలం తంగళ్ళపల్లికి చెందిన అరవై ఏళ్ల ఎర్రవెల్లి బాలకిష్టయ్య భార్యతో కలిసి కలెక్టర్ ఆఫీస్‌కు వస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. సిద్దిపేట-హైదరాబాద్ రాజీవ్ రోడ్డులో ఆయన ఆయన డ్రైవ్ చేస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. భర్త స్పాట్‌లోనే చనిపోతే, భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. 


Also Read: పెళ్లి చేసుకుని బిడ్డను కని భార్యను వదిలేశాడు - 2 రోజులుగా భర్త ఇంటి ముందే బాధితురాలి మౌన పోరాటం