మంచిర్యాల జిల్లాలో పుష్ప సీన్ రిపీట్ అయింది. ఎవరికి తెలియకుండా గుర్తుగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.


మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపూర్ జాతీయ రహదారిపై ఇటుకలు తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. బోల్తా పడిన ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. డాక్టర్ ను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. శ్రీ గంజాయి చత్తీస్గడ్ నుంచి ఇక్కడికి తరలిస్తున్నట్లు పోలీసుల అంచనాకు వచ్చారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


‘పుష్ప’తరహాలో రవాణా..
అక్రమార్కులు గంజాయిని పుష్ప సినిమా తరహాలో ట్రాక్టర్ లో ప్రత్యేకంగా అరలు అమర్చి తరలిస్తున్నారు. ట్రాక్టర్ లో సమకూర్చుకున్న సదరు వ్యక్తులు చత్తీస్ గడ్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేశారని పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ లో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. ట్రాక్టర్ ట్రాలీ నీ లిఫ్ట్‌ సహాయంతో పైకి ఎత్తి టైర్ల పై ప్రాంతంలో ప్రత్యేకంగా షెల్ఫ్‌లను తయారు చేసుకుని గంజాయి ప్యాకెట్లను అందులో అమర్చి రవాణా చేస్తున్నట్లు వివరించారు.


గంజాయి విలువ అంచనా వేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. గంజాయి తరలిస్తున్నట్లు అనుమానం వస్తే సమాచారం అందించాలని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


ఈ గంజాయిని నిందితులు తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తారు. మొదట పట్టణాల్లో, గ్రామాల్లో పరిచయాలు పెంచుకొని వారిని గంజాయి వైపు లాగుతారు. అనంతరం వారికి గంజాయిని అలవాటు చేసి తమ వద్ద ఉన్న గంజాయిని విక్రయిస్తారు. ఇలా ఒక చోట నుంచి మరొక చోటికి ఎవరికి అనుమానం రాకుండా విక్రయిస్తారు. గంజాయిని చిన్న ప్యాకెట్ లో పెట్టి సరఫరా చేస్తారు. ఇలా సరఫరా చేస్తూ అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన అనేక సందర్భాలు ఉన్నాయి. 


ఇలా వీరు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కేజీ 3 వేలకు కొనుగోలు చేసి వాటిని వేరేచోట్ల సుమారు 7 వేల వరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. వ్యసనాలకు అలవాటు పడి డబ్బు సంపాదనకు గంజాయి సరఫరాకు అలవాటు పడతారని పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయిని సేవిస్తూ ఏం చేస్తున్నారో తెలియని మత్తులోకి వెళ్లిపోతారని దీనివల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే వాహనాల తనిఖీల్లో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితులు పట్టుపడితే వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఎవరెవరికి విక్రయించారు? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.  


ఈ గంజాయిని నిందితులు తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తారు. మొదట పట్టణాల్లో, గ్రామాల్లో పరిచయాలు పెంచుకొని వారిని గంజాయి వైపు లాగుతారు. అనంతరం వారికి గంజాయిని అలవాటు చేసి తమ వద్ద ఉన్న గంజాయిని విక్రయిస్తారు. ఇలా ఒక చోట నుంచి మరొక చోటికి ఎవరికి అనుమానం రాకుండా విక్రయిస్తారు. గంజాయిని చిన్న ప్యాకెట్ లో పెట్టి సరఫరా చేస్తారు. ఇలా సరఫరా చేస్తూ అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన అనేక సందర్భాలు ఉన్నాయి.