TikTok Challenge: 



స్కార్ఫ్‌ గేమ్ ఛాలెంజ్‌...


టిక్‌టాక్‌ ఛాలెంజ్ చేస్తూ ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఫ్రాన్స్‌లో జరిగిందీ ఘటన. టిక్‌టాక్‌లో (TikTok) ట్రెండ్ అవుతున్న స్కార్ఫ్‌ గేమ్‌ ఆడుతూ ఊపిరాడక చనిపోయింది. గతేడాది కూడా ఇదే ఛాలెంజ్ చాలా మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. న్యూయార్క్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...క్రిస్టీ సిబాలి అనే బాలిక ప్రమాదకరమైన సాహసం చేసింది. గత నెల మే 27వ తేదీన ఈ స్టంట్ చేసింది. అప్పటి నుంచి అస్వస్థకు గురైంది. మెడ చుట్టూ స్కార్ఫ్‌ గట్టిగా చుట్టుకుని చనిపోయేంత వరకూ కదలకుండా అలాగే పట్టుకోవాలనేదే ఛాలెంజ్. అంతకు ముందు ట్రెండ్ అయిన Blackout Challenge కూడా ఇలాంటిదే. ఇలా తమను తాము చంపుకోవడమే ఛాలెంజ్‌లా క్రియేట్ చేశారు. ఇలా స్కార్ఫ్‌ గొంతుకు చుట్టుకోవడం వల్ల ఊపిరాడదు. బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదు. ఫలితంగా...కొందరికి ఫిట్స్ వస్తాయి. ఇంకొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కి చెందిన బాలిక ఇలానే చేసి ప్రాణాలు తీసుకుంది. ఇప్పటికే చైనీస్ యాప్ టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అడల్ట్ కంటెంట్‌ని ప్రమోట్ చేయడమే కాకుండా...ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేసేలా ప్రేరేపిస్తోందని మండి పడుతున్నారంతా. ఇలాంటి ప్రమాదకర ఛాలెంజ్‌లు ట్రెండ్‌ అవుతుండటం వల్ల టిక్‌టాక్ అలెర్ట్ అయింది. స్కార్ఫ్‌ గేమ్‌ అని సెర్చ్ చేసినా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. తమ కంపెనీ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘించే ఏ ఛాలెంజ్‌నీ ఎంకరేజ్ చేయమని స్పష్టం చేసింది. 


"స్కార్ఫ్‌ గేమ్‌ లాంటి ఛాలెంజ్‌లు మా గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉన్నాయి. టిక్‌టాక్‌ యూజర్స్‌కి పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్నదే మా ప్రియారిటీ. అందుకే మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేశాం"


- టిక్‌టాక్ 


ఇలాంటి ఘటనే చైనాలోనూ జరిగింది. PK Challengeలో భాగంగా మితిమీరి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. చైనాలోని Baijiu పేరుతో విక్రయించే డ్రింక్‌ చాలా ఫేమస్. ఇందులో 30-60% ఆల్కహాల్ ఉంటుంది. ఈ బాటిల్స్‌ని విపరీతంగా తాగడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య ఇదే విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. 


టిక్‌టాక్‌పై బ్యాన్..


టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా. చైనాలోని ByteDanceకు చెందిన టిక్‌టాక్ (TikTok)పై ఇండియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. తాము అందించిన ఏ డివైస్‌లోనూ టిక్‌టాక్‌ యాప్ ఉండటానికి వీల్లేదని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ యాప్‌ కారణంగా భద్రతకు భంగం వాటిల్లుతోందని ఆరోపిస్తోంది. అంతే కాదు. సెన్సిటివ్ సమాచారాన్ని సేకరిస్తున్నారన్న విమర్శలూ చేస్తోంది. ఈ వివరాలు సేకరించేందుకు చైనా ఈ యాప్‌ను అస్త్రంగా వాడుకుంటోందని మండి పడుతోంది. ఇక అగ్రరాజ్యంలోనూ టిక్‌టాక్‌పై అసహనం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అన్ని డివైస్‌లలోనూ టిక్‌టాక్‌ను తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు వెంటనే అప్రమత్తమవ్వాలని తేల్చి చెప్పింది. 


Also Read: ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్‌బాడీని ట్యాంక్‌లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా