Massive Drugs Seized In Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు ఈ సోదాలు చేశారు. డీఆర్ఐ, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. లారీలో తరలిస్తుండగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారు కాగా.. పట్టుకున్న మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వీటిని ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని చిరాగ్‌పల్లి పీఎస్‌కు తరలించారు.


Also Read: Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం