Zomato Alternative Apps: జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. పండుగ సీజన్ నేపథ్యంలో రూ.7 నుంచి రూ.10కి పెంచింది. కంపెనీ ఆపరేషన్ ఖర్చులను కవర్ చేయడానికి పెంచకతప్పలేదని చెప్పుకొచ్చింది. ఈ ఫుడ్‌ డెలివెరీ కంపెనీకి ఇది కొత్త కాదు. 2023 ఆగస్టులో రూ.2ను ఫ్లాట్‌ ఫీజ్‌గా వసూలు చేసిన జొమాటో, ఆ మొత్తాన్ని విడతలవారీగా పెంచుతూనే ఉంది.


జొమాటో కంటే తక్కువ ఫ్లాట్‌ఫామ్‌ ఫీజ్‌ వసూలు చేస్తున్న కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై డబ్బు ఆదా చేయాలనుకుంటే వాటిని ట్రై చేయొచ్చు.


స్విగ్గీ (Swiggy): జొమాటోకు గట్టి పోటీ ఇస్తున్న కంపెనీ ఇది. శాఖాహారం నుంచి మాంసాహార వంటకాల వరకు బోలెడన్ని ఆప్షన్స్‌ అందిస్తోంది. ఇటీవలే, స్విగ్గీ సీల్‌ (Swiggy Seal) పేరిట రేటింగ్‌ ప్రారంభించింది. ఇది, హోటళ్లు & రెస్టారెంట్లలో ఆహారం నాణ్యత, వంటగది పరిశుభ్రతకు సంబంధించిన రేటింగ్‌. ప్రస్తుతం, Swiggy ఒక్కో ఆర్డర్‌కు ప్లాట్‌ఫామ్‌ రుసుముగా రూ.6 వసూలు చేస్తోంది.


ONDC (వయా Paytm): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని "ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్" (ONDC) కొనుగోలుదార్లు-అమ్మకందార్లను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానిస్తుంది. ONDCలో ఆహారం సహా చాలా రకాల వస్తువులను కూడా ఆర్డర్‌ చేయొచ్చు. పేటీఎం యాప్ ద్వారా ONDCలో ఫుడ్ ఆర్డర్‌ పెచ్చొచ్చు. చాలా తక్కువ ప్లాట్‌ఫామ్‌ ఫీజ్‌ను ఇక్కడ తీసుకుంటారు.


ఈట్‌ష్యూర్‌ (EatSure): ఫుడ్ డెలివరీ స్పేస్‌లో ఉన్న మరొక టాప్‌ ప్లేయర్ ఇది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు, ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా విభిన్న రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకోవచ్చు. EatSure చాలా తక్కువ ట్రాన్జాక్షన్‌ ఫీజ్‌, డెలివెరీ ఫీజ్‌లను వసూలు చేస్తోంది.


డొమినోస్ ఇండియా (Domino's India): డొమినోస్ ఇండియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. మీ ఇంటికి-అవుట్‌లెట్‌కు మధ్య ఉన్న దూరాన్ని బట్టి డెలివరీ రుసుమును వసూలు చేస్తుంది. అయితే, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పిజ్జాల ఆర్డర్‌ చేస్తే.. "30 నిమిషాల్లో డెలివరీ లేదా ఫ్రీ" ఆఫర్‌ కూడా ఉంది. ఈ ఆఫర్ సెలవు రోజుల్లో మాత్రం వర్తించదు.


హోమ్‌ఫుడీ ‍‌(HomeFoodi): ఇంట్లో వండిన నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో ఇది స్పెషలిస్ట్‌. చాలా రకాల సంప్రదాయ వంటకాలను ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఆర్డర్‌ చేయొచ్చు. 100% రిఫండ్‌, 0% క్యాన్సిలేషన్‌ ఛార్జీ వంటి సౌలభ్యాలు కూడా ఇందులో ఉన్నాయి.


మ్యాజిక్‌పిన్ (Magicpin): పార్ట్‌నర్‌షిప్‌ ఉన్న రెస్టారెంట్లలో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లు, రివార్డ్‌ పాయింట్లను ఇది అందిస్తుంది. మ్యాజిక్‌పిన్ ప్లాట్‌ఫామ్‌ ఫీజ్‌ 2 రూపాయలు.


డన్జో (Dunzo): బెంగుళూరులో ప్రారంభమైన ప్రస్థానం వేగంగా ఇతర నగరాలకు విస్తరించింది. శాకాహారులు, మాంసాహారులు ఇద్దరికీ సర్వ్‌ చేస్తుంది. ఇది, వర్షాల సమయంలో మాత్రమే ఎక్కువ ఫ్లాట్‌ఫామ్‌ ఫీజ్‌లు వర్తింపజేస్తుంది.


కేఎఫ్‌సీ (KFC):  ఫాస్ట్ ఫుడ్ ప్రియుల డెస్టినేషన్‌గా మారింది. చికెన్‌ ఫ్రై నుంచి బర్గర్‌ల వరకు డెలీషియస్‌ ఫుజ్‌ రేంజ్‌ను అందిస్తుంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లను వేగంగా డెలివెరీ చేస్తూ భోజనప్రియుల జిహ్వ చాపల్యం చల్లారుస్తోంది.


బిర్యానీ బై కిలో (Biryani by Kilo): ప్రీమియం బిర్యానీలను డెలివరీ చేయడంలో స్పెషలైజేషన్‌ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వండే విభిన్న రకాల బిర్యానీలను ఇది సప్లై చేయగలదు.


మరో ఆసక్తిర కథనం: దీపావళి షాపింగ్‌లో ఈ పొరపాటు చేయకండి, మోసానికి బలికాకండి!