Wipro Investment:
ఐటీ సేవల కంపెనీ విప్రో అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై రూ.8300 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించింది. ఇది కృత్రిమ మేథస్సు, డేటా, అనలిటిక్స్‌లో తాము ముందుకెళ్లడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. సరికొత్త కన్సల్టింగ్ సామర్థ్యం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.
కృత్రిమ మేథస్సు ఎకోసిస్టమ్‌కు సంబంధించిన 'విప్రో ఏఐ360' సేవలు ఆరంభించినట్టు కంపెనీ తెలిపింది. రాబోయే 12 నెలల్లో 2,50,000 మందికి పైగా ఉద్యోగులకు కృత్రిమ మేథస్సుపై శిక్షణ ఇస్తామని వెల్లడించింది. తమ కంపెనీలో 25వేల మంది ఇంజినీర్లు మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్ ఏఐ సర్టిఫికేషన్ పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఈ మధ్యే విప్రో పోటీదారు టీసీఎస్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ప్రత్యేకించి జనరేటివ్ ఏఐ ఆవిర్భావంతో అన్ని రంగాలకు చెందినవాళ్లు ప్రాథమికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. సరికొత్త బిజినెస్ మోడళ్లు, సరికొత్త పని పద్ధతులు, సరికొత్త సవాళ్లూ వస్తున్నాయి. అందుకే విప్రో ఏఐ360 ఎకోసిస్టమ్‌తో బాధ్యతాయుతమైన ఏఐ ఆపరేషన్స్ చేపట్టనుంది' అని విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ థియెర్రీ డెలాపొర్ట్ అన్నారు.
విప్రో నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి 30000 మంది డేటా అనలిటిక్స్, ఏఐ, టెక్ ఎకోసిస్టమ్‌పై కలిసి పనిచేస్తారు. ఏఐ360తో మరింత కస్టమైజేషన్, ప్రత్యేకమైన అంశాలపై ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని విప్రో తెలిపింది. అంతేకాకుండా విప్రో వెంచర్స్ ద్వారా స్టార్టప్పుల్లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది. జనరేటివ్ ఏఐపై దృష్టి సారించే అంకుర సంస్థల కోసం సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మొదలు పెట్టనుంది. దాని ద్వారా వారిని ఇండస్ట్రీకి సిద్ధం చేస్తామంది
వివిధ రంగాల్లోని కంపెనీలకు జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిష్కారాలు అందించేందుకు ఈ ఏడాది మేలో గూగుల్‌తో విప్రో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీస్‌పై 20,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే కంపెనీకి జనరేటివ్ ఏఐ సీఓఈ వ్యవస్థ ఉంది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ కంపెనీలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఫోకస్ చేశాయి. సొంతంగా బిజినెస్ సొల్యూషన్స్ డిజైన్ కోసం టీసీఎస్ జనరేటివ్ ఏఐ గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ సేవలపై ఆధారపడనుంది. ఇన్ఫోసిస్ సైతం మేలో ఏఐ ఫస్ట్ టోపాజ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌కేర్ నుంచి బిగ్ టెక్ వరకు చాలా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: మ్యాగ్జిమమ్ రిఫండ్ పొందేందుకు 5 స్ట్రాటెజీలు, తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial