ITR Filing 2023: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 31. అంటే, ఈ నెలాఖరు కల్లా మీ రిటర్న్ దాఖలు చేయాలి.
సాధారణంగా, ఫామ్ 16లో చూపిన దానికంటే ఎక్కువ టాక్స్ సేవ్ చేయలేమని, అలా చేయడం అసలు సాధ్యం కాదని చాలా మంది నమ్ముతున్నారు. కానీ వాస్తవం వేరు. సరైన నాలెడ్జ్ ఉంటే, ఫామ్ 16లో కనిపించిన దాని కంటే ఎక్కువ టాక్స్ సేవ్ (tax saving) చేయవచ్చు. అంతేకాదు, ఎక్కువ రిఫండ్ (Income Tax Refund) క్లెయిమ్ చేయడం చాలా సాధ్యమే. దీని కోసం, ఫస్ట్ చేయాల్సిన పని సాధ్యమైనంత త్వరగా ITR ఫైల్ చేయడం. రిఫండ్ అనేది, ఐటీ రిటర్న్ ప్రాసెసింగ్‌లో ఒక భాగం. ప్రాసెస్ ఎంత త్వరగా జరిగితే, రిఫండ్ అంత వేగంగా వస్తుంది.
మీ ITR మీద మ్యాగ్జిమమ్ టాక్స్ రిఫండ్ పొందేందుకు మీకు సాయం చేసే కొన్ని స్ట్రాటెజీలను ఈ స్టోరీలో మీ కోసం అందిస్తున్నాం.
మీకు అనుకూలమైన టాక్స్ రెజిమ్ (tax regime) ఎంచుకోండి
మ్యాగ్జిమమ్ టాక్స్ రిఫండ్ పొందడానికి, పాత/కొత్త పన్ను విధానాల్లో మీకు ఏ విధానం సరిపోతుందో చెక్ చేయాలి. ఎందుకంటే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS), జీవిత బీమా పాలసీల వంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టకపోతే; హోమ్ లోన్ మీద వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పన్ను మినహాయింపులు (tax deductions) మీకు లేకపోతే, కొత్త పన్ను విధానం (new tax regime) మీకు సూట్ అవుతుంది. దీనిలో తక్కువ టాక్స్ రేట్లు ఉంటాయి; టాక్స్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఉండవు.
ఆన్ టైమ్‌లో ITR ఫైల్ చేయండి, చివరి క్షణం వరకు ఎదురు చూడొద్దు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం.. నిర్దేశించిన గడువు తేదీలోగా టాక్స్ పేయర్ ITRను ఫైల్ చేయడం మంచిది. ఆలస్యమైన/డేట్ మిస్ అయిన రిటర్న్‌పై సెక్షన్ 234F కింద ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీ 'పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం' (taxable income) రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఈ ఫైన్ రూ. 5,000 వరకు ఉంటుంది.
డేటాను సరిచూసుకోండి
ఫామ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (AIS) కనిపించే డేటాను, మీ వాస్తవ ఆదాయంతో సరిపోయేలా చూసుకోవాలి.
రిటర్న్‌ను ఒక నెలలోగా ఈ-వెరిఫై చేయండి
ఇన్‌కమ్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత, దానిని ఒక నెల లోపు ఈ-వెరిఫై (E-verify) చేయాలి. అంటే, మీరు ఫైల్ చేసిన రిటర్న్‌ను ధృవీకరించాలి. ఈ-వెరిఫై తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. మీరు మీ రిటర్న్‌ను ఎంత త్వరగా వెరిఫై చేస్తే, మీ రిఫండ్ అంత త్వరగా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.
అర్హత గత తగ్గింపులు, మినహాయింపులను గుర్తించండి
పన్ను విధించదగిన ఆదాయం నుంచి మీరు క్లెయిమ్ చేయగల డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్‌ను సరిగ్గా లెక్కించండి. దీనివల్ల, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా రిఫండ్ మొత్తం పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: నిఫ్టీ ఎలైట్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఫస్ట్ డే పెర్ఫార్మెన్స్ ఇది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial