Indian Currency Notes : రూపాయి (Indian Rupee).. భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. ₹, Rs, రూ. లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ఇండియన్ కరెన్సీ అనగానే సాధారణంగా గుర్తొచ్చేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్ సంతకం, నోటుపై ఉండే చిహ్నాలు, గాంధీ చిత్రం. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా నోటుపై కనిపిస్తాయి. ప్రతి ఇండియన్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంతకం ఉంటుంది. ఇది లేకుండా నోటు చెల్లదు. అయితే భారతీయ నోట్లపై తొలిసారిగా ఏ గవర్నర్ పేరును ముద్రించారు అని ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత విలువైన ఈ నోటు విలువను పెంచే గవర్నర్ సిగ్నేచర్ మొదటగా ఎవరు చేశారు.. దాని వెనుక స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్లపై తొలిసారిగా కనిపించింది ఆయన పేరే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 1935న స్థాపించినప్పటికీ.. స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత, జనవరి 1938లో, ఆర్హీఐ మొదటిసారిగా రూ.5 కరెన్సీ నోటును విడుదల చేసింది. ఈ నోటుపై 'కింగ్ జార్జ్ VI' చిత్రాన్ని ముద్రించారు. ఆ సమయంలో భారతదేశానికి రెండవ గవర్నర్ జేమ్స్ బ్రాడ్ టేలర్. అదే ఏడాది ఆర్‌బీఐ మళ్లీ రూ.10 నోట్లు, మార్చిలో రూ.100 నోట్లు, జూన్‌లో రూ.1,000, రూ.10,000 కరెన్సీ నోట్లను విడుదల చేసింది.
స్వాతంత్ర్యం తర్వాత నోటుపై మారిన చిత్రం
భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత మొదటగా రూ.1 కరెన్సీ నోటును 1949లో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది. 1947 సంవత్సరం వరకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోట్లపై బ్రిటీష్ రాజు జార్జ్ బొమ్మ ముద్రించారు. కానీ స్వతంత్ర భారతదేశంలో మొదటి 1 రూపాయి నోటుపై, కింగ్ జార్జ్ చిత్రం స్థానంలో సారనాథ్ నుండి అశోక స్తంభం సింహం రాజధాని చిహ్నంతో కొత్త బ్యాంకు నోట్లు జారీ చేశారు. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా బెంగాల్ రామారావు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1969లో గాంధీజీ స్మారకార్థం తొలిసారిగా రూ.100 నోట్లను విడుదల చేసింది.
గాంధీజి చిత్రాన్ని అప్పుడే చేర్చారు
గాంధీజీ 100వ జయంతి సందర్భంగా 1969 వరకు కరెన్సీ నోటుపై గాంధీజీ చిత్రం మొదటిసారి కనిపించింది. ఇందులో మహాత్మా గాంధీ కూర్చున్నట్లు కనిపించేవారు. సేవాగ్రామ్ ఆశ్రమం బ్యాగ్రౌండ్ లో ఉండేది. 1987లో మహాత్మా గాంధీ చిత్రపటం భారతీయ నోట్లపై సాధారణ అంశంగా మారింది. 1996లో, అప్పటి వరకు ముద్రించిన అన్ని బ్యాంకు నోట్ల స్థానంలో మహాత్మా గాంధీ ఫొటోతో నోట్లు విడుదల అయ్యాయి.
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీ చిత్రాన్ని పెయింటింగ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజానికి క్యారికేచర్ (Caricature) కాదు. 1946లో తీసిన గాంధీ ఫొటోలోని భాగాన్నే కరెన్సీ నోటుపై ముద్రించారు. అప్పుడు తీసిన ఫొటోలో, బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెథిక్-లారెన్స్‌తో గాంధీ నిలబడి ఉంటారు. గాంధీ చిరునవ్వుతో ఉన్న ఫొటో, మంచి ఎక్స్‌ప్రెషన్‌గా భావించి దీన్ని ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని కరెన్సీ నోట్లు గాంధీ చిత్రంతోనే విడుదల అవుతున్నాయి.
భారతదేశ మొదటి గవర్నర్
ఆర్బీఐ తొలి గవర్నర్ సర్ ఓస్బోర్న్ స్మిత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు. ఒస్బోర్న్ స్మిత్ 1 ఏప్రిల్ 1935న ఆర్బీఐ మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో, స్మిత్ ఒక ప్రొఫెషనల్ బ్యాంకర్ గా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో 20 సంవత్సరాలు పనిచేశారు. కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, స్మిత్.. 1926లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమై భారతదేశానికి వచ్చాడు. అయితే ఆయన హయాంలో ఆర్బీఐ నోట్లను విడుదల చేయలేదు.
Also Read : Flight Journey Rules: ఫ్లైట్‌లో 7 కిలోల లగేజ్‌కు మాత్రమే అనుమతి - హ్యాండ్ బ్యాగ్ బరువును కూడా కలుపుతారా?