Flight Baggage Rules Changed: మన దేశంలో ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు విమానంలో ప్రయాణిస్తున్నారు. కొత్త సంవత్సరం సెలవుల సందర్భంగా విమానాల్లో రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో జర్నీ చేసేవాళ్ల కంటే ఎక్కువ మంది ప్రయాణీకులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఎయిర్‌ పాసెంజర్ల సంఖ్య వృద్ధి చెందుతూనే ఉంది. ఏ వ్యక్తి అయినా, విమానంలో ప్రయాణించాలంటే కొన్ని రూల్స్‌ పాటించాలి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ నిబంధనలు సెట్‌ చేశారు.


విమానంలో ప్రయాణించే ముందు మీరు చెక్ ఇన్ కావాలి. మీరు తీసుకెళ్లే లగేజీని కూడా అక్కడ తనిఖీ చేస్తారు. 'బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ' (BCAS), 'సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్' (CISF) విమానాల్లో ప్రయాణించే వారి లగేజీకి సంబంధించిన నిబంధనలు మార్చాయి. ఇప్పుడు, విమాన ప్రయాణీకులు ఒక బ్యాగ్‌లో 7 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లగలరు. అయితే, ఈ 7 కిలోల లగేజ్‌లో బ్యాగ్‌ బరువు కూడా కలిసి ఉంటుందా, లేదా అన్నది చాలామందికి ఉన్న సందేహం. 


7 కిలోల బరువున్న బ్యాగ్‌ మాత్రమే తీసుకెళ్లాలి
మీరు విమాన ప్రయాణం చేయబోతుంటే సివిల్ ఏవియేషన్‌కు సంబంధించిన కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశీయ విమానాలు (Domestic flights) లేదా అంతర్జాతీయ విమానాల్లో (Iinternational flights) ప్రయాణించే వ్యక్తులు జర్నీ సమయంలో ఒక బ్యాగ్‌ను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి లభిస్తుంది. హ్యాండ్ బ్యాగ్‌తో కలిపే ఈ రూల్‌ వర్తిస్తుంది. అంటే, మీ చేతి సంచి 2 కేజీల బరువు ఉంటే, దానిలో గరిష్టంగా 5 కిలోల సామగ్రిని మాత్రమే మీరు తీసుకెళ్లగలరు. కాబట్టి, మీరు ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే మీ బ్యాగేజీ బరువును చూసుకోవడం బెటర్‌. 


ఎకానమీ క్లాస్‌ (Economy Class Passengers) & ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు (Premium Economy Class Passengers) గరిష్టంగా 7 కిలోల హ్యండ్‌ బ్యాకేజీ పరిమితి వర్తిస్తుంది. ఫస్ట్ క్లాస్ (First Class Passengers) & బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వ్యక్తులు (Business Class Passengers) తమ వెంట 10 కిలోల వరకు బరువున్న బ్యాగ్‌ తీసుకెళ్లవచ్చు. 


పరిమితికి మించి బరువు ఉంటే ఏం జరుగుతుంది?
విమానాల్లో ప్రయాణించే వారి విషయంలో.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) హ్యాండ్‌ బ్యాగ్ బరువుపైనే కాకుండా దాని పరిమాణంపైనా ఆంక్షలు విధించాయి. నిబంధనల ప్రకారం, ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగేజీ ఎత్తు 55 సెం.మీ. (21.6 అంగుళాలు), పొడవు 40 సెం.మీ. (15.7 అంగుళాలు) & వెడల్పు 20 సెం.మీ. (7.8 అంగుళాలు) ఉండాలి. ప్రయాణీకులు 7 బరువు లేదా నిర్ణీత పరిమాణంలో కంటే ఎక్కువ సైజ్‌లో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ లేదా క్యాబిన్ బ్యాగ్‌ను విమానంలోకి తీసుకువెళ్లాలని అనుకుంటే, వాటిపై అదనపు ఛార్జీలు చెల్లించాలి.


మరో ఆసక్తికర కథనం: కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB