Punjab National Bank Revised Fixed Deposit Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లకు బంపర్ న్యూ ఇయర్ గిఫ్ట్‌ అందించింది. ఈ బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు జనవరి 01, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు రెండు కొత్త కాల వ్యవధులను బ్యాంక్‌ జోడించింది.


PNB, సాధారణ పౌరులకు (60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) 303 రోజుల కాలవ్యవధి (Tenure) కోసం 7 శాతం వడ్డీ రేటును నిర్ణయించగా, 506 రోజుల కాలవ్యవధికి 6.70 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. దీని కింద, పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏకమొత్తాన్ని డిపాజిట్ చేయాలి, ఈ డిపాజిట్‌పై పెరిగిన వడ్డీని పొందుతారు. 


కొత్త సమాచారం ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.25 శాతం వడ్డీని ఇస్తుంది. 400 రోజుల కాలానికి వడ్డీ రేటు 7.25 శాతంగా నిర్ణయించింది. 


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు (New interest rates on Punjab National Bank fixed deposits)


7 రోజుల నుంచి 14 రోజులకు --- సాధారణ పౌరులకు 3.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సీనియర్ సిటిజన్లు లేదా సూపర్ సీనియర్ సిటిజన్లకు 4.30 శాతం


15 రోజుల నుంచి 29 రోజులకు --- సాధారణ పౌరులకు 3.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సీనియర్ సిటిజన్లకు 4.3 శాతం


30 రోజుల నుంచి 45 రోజులకు --- సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 4.30 శాతం.


46 రోజుల నుంచి 60 రోజులకు --- సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 5.30 శాతం వడ్డీ రేటు నిర్ణయించబడింది. 


61 రోజుల నుంచి 90 రోజులకు --- సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 5.30 శాతం వడ్డీ రేటు. 


91 రోజుల నుంచి 179 రోజులకు --- సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం. 


180 రోజుల నుంచి 270 రోజులకు --- సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ రేటు నిర్ణయించబడింది.


271 రోజుల నుంచి 299 రోజులకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.


300 రోజులకు --- సాధారణ పౌరులకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం.


301 రోజుల నుంచి 302 రోజుల వరకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.


303 రోజులకు --- సాధారణ పౌరులకు 7.0 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం.


304 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు --- సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.0 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్‌లకు 7.30 శాతం.


1 సంవత్సరానికి --- సాధారణ పౌరులకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.30 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం.


1 సంవత్సరం నుంచి 399 రోజుల వరకు --- సాధారణ పౌరులకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.30 శాతం & సూపర్‌ సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం.


* ఇంతకంటే ఎక్కువ రోజుల వ్యవధి & దానిపై వడ్డీ రేటు కోసం PNB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


* 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సీనియర్ సిటిజన్‌లుగా, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సూపర్‌ సీనియర్ సిటిజన్‌లుగా పరిగణిస్తారు.


మరో ఆసక్తికర కథనం: 'బ్యాంక్‌నెట్‌' గురించి తెలుసా? - ఇల్లయినా, పొలమైనా, షాపయినా, ఎలాంటి ఆస్తినైనా చాలా చవకగా కొనొచ్చు!