What Is Vijay Mallya Net Worth Now: విజయ్ మాల్యా అంటే ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. మద్యం వ్యాపారంలో ఉన్నంత కాలం ఆయనకు తిరుగులేదు. కానీ ఎప్పుడు అయితే ఆయన ఎయిర్ లైన్స్ ప్రారంభించారో అప్పుడే ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది. దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
అన్ని వ్యాపారాలు సక్సెస్ - ముంచేసిన ఎయిర్ లైన్స్
28 సంవత్సరాల వయస్సులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతని శైలికి తగ్గ వ్యాపారం కావడంతో విస్తరణలో దూకుడు చూపించాడు. మద్యం, ఏవియేషన్, రియల్ ఎస్టేట్ , స్పోర్ట్స్ రంగాల్లో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆడంబరమైన జీవనశైలి, హై-ప్రొఫైల్ వెంచర్‌లు, RCB యాజమాన్యం, ఫార్ములా 1లో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు విజయ్ మాల్యాను వ్యాపార ప్రపంచంలో ఓ ప్రత్యేక ప్రయత్నంగా నిలిచాయి. కానీ ఎయిర్ లైన్స్ మొత్తంగా దెబ్బకొట్టింది.
యూకేలో విలాసవంతమైన జీవితం 2005లో ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది, చివరికి రూ.9,000 కోట్లకు పైగారుణాలపై డిఫాల్ట్ అయింది. 2012 నాటికి, ఎయిర్‌లైన్ కార్యకలాపాలు నిలిపివేశారు. 2016లో దేశం విడిచి వెళ్లారు. అయితే మాల్యా యూకే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయన కు ఆస్తులు ఇంకా పెద్ద మొత్తంలో ఉన్నాయి.
ఇప్పటికీ యునైటెడ్ బ్రూవరీస్ లో వాటాలు - భారీ ఆదాయం
విజయ్ మాల్యాకు న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజాలో ఒక పెంట్‌హౌస్ , మూడు లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. కొన్ని కుమార్తె పేరు మీద ఉన్నాయి. ఫ్రాన్స్‌లోని సెయింట్-మార్గరైట్ ద్వీపంలో కాన్స్ సమీపంలో లె గ్రాండ్ జార్డిన్ ఎస్టేట్ కూడా మాల్యా సొంతం. లండన్ కార్న్‌వాల్ టెర్రస్‌లో రెండు చారిత్రాత్మక మాన్షన్‌లు మాల్యాకు ఉన్నాయి. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో లేడీవాక్ మాన్షన్ 2015లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం మాల్యా ఆస్తులు ది ఇండిపెండెంట్ అనే పత్రిక కథనం ప్రకారం 2022 జూలై నాటికి సుమారు రూ. 9,600 కోట్లు ఉన్నాయి.
తన ఆస్తుల నుంచి బ్యాంకులు 14వేల కోట్లు వసూలు చేశాయన్న మాల్యా
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో 0.1 శాతం, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో 8.08 శాతం వాటాలను విజయ్ మాల్యా ఇప్పటికీ కలిగి ఉన్నాడు. మాల్యా ఆస్తుల నుండి బ్యాంకులు సుమారు రూ.14,000 కోట్లు వసూలు చేసినట్లుగా ఆయన చెబుతున్నారు. మాల్యాకు ఆదాయం ప్రధానంగా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ నుండి వస్తుంది.మాల్యా ఇప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ.. ఆయన పేరు ప్రఖ్యాతులన్నింటినీ పోగొట్టుకున్నారు.