Bajaj Finance Digital FDs:


ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో, మీ సేవింగ్స్‌ని పెంచుకోవటానికి సురక్షితమైన, విశ్వసనీయమైన పద్ధతి చాలా అవసరం. తమ పెట్టుబడులలో స్థిరత్వము మరియు పెరుగుదల కొరకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‎డిలు)ఒక టైమ్-టెస్టెడ్ పరిష్కారాన్ని అందిస్తాయి. వీటిలో ఫ్లెక్సిబిలిటి, సురక్షిత మరియు ఆకర్షణీయమైన రిటర్న్స్‌ కు ప్రసిద్ధి చెందినవిగా బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గుర్తించబడతాయి.


ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‎డి)అంటే ఏమిటి?


ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక నిర్ణీత కాలపరిమితికి ఒక ఆర్ధిక సంస్థలో మీరు డిపాజిట్ గా పెట్టిన ఏకమొత్తం డబ్బు పెట్టుబడి. దీనికి ఫలితంగా, మీకు ఆ పెట్టుబడి కాలవ్యవధిలో స్థిరంగా ఉండే హామీ ఇవ్వబడిన వడ్డీని అందుకుంటారు. కాలపరిమితి చివరిలో, మీరు పోగైన వడ్డీతో కలిపి మీ ప్రధాన మొత్తాన్ని అందుకుంటారు.


బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ఎఫ్‎డీ


బజాజ్ ఫైనాన్స్ ఇటీవల ‘డిజిటల్ ఎఫ్‎డి’ అని పిలువబడే ఒక కొత్త రకం ఎఫ్‎డిని ప్రవేశపెట్టింది ఈ ఎఫ్‎డి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది:
పూర్తిగా ఆన్లైన్: ఎఫ్‎డి ని తెరవడం నుండి దానిని నిర్వహించడము వరకు మొత్తం ప్రక్రియను బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా డిజిటల్ గా చేయవచ్చు. 
పోటీ వడ్డీ రేట్లు: డిజిటల్ ఎఫ్‎డి వార్షికానికి 8.85% వరకు అత్యధిక వడ్డీ రేట్లను అందించేవాటిల్లో ఒకటి.


బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?
భద్రత మరియు సురక్షత: బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డీలు సిఆర్‎ఐఎస్‎ఐఎల్ మరియు ఐసిఆర్‎ఏ వంటి ఏజెన్సీల నుండి మరియు టాప్-టైర్ AAA రేటింగ్స్ ను అందుకుంది. అంటే మీ పెట్టుబడి భద్రంగా మరియు సురక్షితంగా ఉంటుంది.
ఆకర్షణీయమైన రిటర్న్స్: బజాజ్ ఫైనాన్స్ వారి పోటీ వడ్డీ రేట్లతో గణనీయమైన రిటర్న్స్ ను సంపాదించుకోండి. బజాజ్ ఫైనాన్స్ వయోజన పౌరులకు వార్షికానికి 8.85% వరకు మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వినియోగదారులకు వార్షికానికి 8.60% వరకు వడ్డీ అందిస్తుంది. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మీరు అందుకునే దాని కంటే తరచూ ఎక్కువగానే ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటి: బజాజ్ ఫైనాన్స్ 12 నుండి 60 నెలల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ కాలపరిమితులతో ఫిక్స్డ్ డిపాజిట్స్ ను అందిస్తుంది. మీరు స్వల్పకాలిక లాభాల కోసం చూస్తుంటే లేదా దీర్ఘ-కాలిక ఆర్ధిక లక్ష్యాల కోసం ప్రణాళిక చేస్తూ ఉంటే, బజాజ్ ఫైనాన్స్ వివిధ ఆర్ధిక ప్రణాళికలకు తగిన అనేక కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.
సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపికలు: బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ లేదా యాప్ ఉపయోగించి ఎక్కడి నుండైనా మీ ఫిక్స్డ్ డిపాజిట్ ను సులభంగా బుక్ చేసుకోండి, నిర్వహించండి మరియు ట్రాక్ చేయండి.
వయోజన పౌరుల కొరకు అదనపు ప్రయోజనాలు: వయోజన పౌరులు సాధారణ ఎఫ్‎డి కంటే వార్షికానికి 0.25% వరకు అదనపు రేట్ ప్రయోజనాన్ని అందుకోవచ్చు (బేస్ రేట్ కంటే ఎక్కువగా)
ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ విధంగా మీ ఆర్ధిక ప్రణాళికలకు తోడ్పడతాయి
అత్యవసర నిధిని ఏర్పరచుకొనుటకు: మీ అత్యవసర పొదుపులో ఒక భాగాన్ని నిల్వ చేసుకొనుటకు ఎఫ్‎డిలు ఒక సురక్షితమైన చోటును అందిస్తాయి, ముఖ్యంగా ఒక నిర్దిష్ట కాలము వరకు దాని అవసరాన్ని మీరు ఊహించనప్పుడు. అవసరమైనప్పుడు ప్రాప్యతను నిర్ధారించుటకు చిన్న ఎఫ్‎డి కాలపరిమితిని ఎంచుకోండి మరియు ముందుగానే విత్‎డ్రాయల్ చేసుకొనుటకు రుసుమును అర్థంచేసుకోండి.
స్వల్ప-కాలిక లక్ష్యాల కొరకు పొదుపు చేసుకోవడం: ఒక ఎఫ్‎డి తో మీ డబ్బును స్థిరంగా పెంచుకోవడం ద్వారా సెలవు లేదా డౌన్ పేమెంట్ వంటి లక్ష్యాలను వేగంగా పూర్తిచేసుకోండి.
దీర్ఘ-కాలిక ఆర్ధిక ప్రణాళిక: హామీఇవ్వబడిన అభివృద్ధితో మీ సంపదలో ఒక భాగాన్ని సురక్షితం చేయడముద్వారా ఎఫ్‎డిలు పదవీవిరమణ ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి.
క్రమమైన ఆదాయం ఎంపిక: కొన్ని ఆర్ధిక సంస్థలు వారి ఎఫ్‎డి పై కాలానుగుణ చెల్లింపులను అందిస్తాయి (నెలవారి, త్రైమాసికము, అర్థవార్షికము లేదా వార్షికము) తద్వారా పదవీవిరమణ చేసిన వారికొరకు ఉపయోగపడే క్రమానుసార ఆదాయము కొరకు వనరు అందిస్తాయి.


ముగింపు
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రత, మంచి రిటర్న్స్ మరియు సౌకర్యవంతమైన విశేషాల మధ్య తెలివైన సమతౌల్యాన్ని అందిస్తాయి. ఇది మీ డబ్బును రక్షించడమే కాకుండా పోటీ వడ్డీ రేట్లు మరియు సులభమైన ఆన్లైన్ ఎంపికలను కూడా అందిస్తాయి. దీనితో ఇవి అభివృద్ధి కోరుకునే పెట్టుబడిదారులకు గొప్ప ఎంపిక అవుతాయి.



ముఖ్య గమనిక: ఇది కేవలం ఆ కంపెనీ ప్రకటన మాత్రమే. ఇందులోని అంశాలకు ABP/ABP Live/ABP Desam కి ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని ప్రకటనలకు, అభిప్రాయాలకు మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.