Trading ideas: గత వారంలో దేశీయ మార్కెట్లలో సానుకూలతలు ఉన్నా, విదేశీ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలాంటి ప్రధాన ట్రిగ్గర్లు లేకపోవడం వల్ల, గ్లోబల్‌ ట్రెండ్‌కు అనుగుణంగా మన ఈక్విటీ మార్కెట్లు సాగవచ్చు. ఈ నేపథ్యంలో, సమీప కాలంలో 12% వరకు ర్యాలీ చేసేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌ ఇవి:


లార్సెన్‌ & టూబ్రో (L&T)    
రేటింగ్‌: బయ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 2,227
టార్గెట్‌ ధర: రూ. 2,380
స్టాప్‌ లాస్‌: రూ. 2,150
ఎనలిస్ట్‌: శ్రీకాంత్ చౌహాన్, ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్, కోటక్ సెక్యూరిటీస్     
ఎనలిస్ట్‌ ఏం చెప్పారు?: ఈ స్టాక్‌, ఇటీవలి నెలల్లో కనిష్ట స్థాయిల నుంచి బలమైన ర్యాలీ చేసింది. బ్రేక్‌-ఔట్ స్థాయి పైన సౌకర్యవంతంగా క్లోజ్‌ అయింది. కొనసాగనున్న ర్యాలీని ఇది సూచిస్తోంది.    


ఐటీసీ (ITC)     
రేటింగ్‌: బయ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 383.3
టార్గెట్‌ ధర: రూ. 410
స్టాప్‌ లాస్‌: రూ. 370
ఎనలిస్ట్‌: శ్రీకాంత్ చౌహాన్, ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్, కోటక్ సెక్యూరిటీస్ 
ఎనలిస్ట్‌ ఏం చెప్పారు?: డైలీ & వీక్లీ చార్టుల్లో ఈ కౌంటర్ "హయ్యర్‌ హైస్‌ & లోయర్‌ లోస్‌" నమూనాతో రైజింగ్‌ ఛానెల్‌లోకి అడుగు పెట్టింది.    


జొమాటో (Zomato)    
రేటింగ్‌: బయ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 51.6
టార్గెట్‌ ధర: రూ. 56
SL 49
ఎనలిస్ట్‌: శ్రీకాంత్ చౌహాన్, ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్, కోటక్ సెక్యూరిటీస్ 
ఎనలిస్ట్‌ ఏం చెప్పారు?: గరిష్ట స్థాయుల నుండి క్షీణత తర్వాత, వీక్లీ చార్ట్‌లో మల్టీపుల్‌ సపోర్ట్‌ జోన్‌ నుంచి మళ్లీ ఈ స్టాక్‌ పుంజుకుంది.


షాఫ్లర్‌ (Schaeffler)        
రేటింగ్‌: బయ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 2,953    
టార్గెట్‌ ధర: రూ. 3,350
స్టాప్‌ లాస్‌: రూ. 2,700
ఎనలిస్ట్‌: సుభాష్‌ గంగాధరన్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌    
ఎనలిస్ట్‌ ఏం చెప్పారు?: ఈ స్టాక్ రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, రూ. 2930- 2970 స్థాయుల మధ్య బయ్‌ రేటింగ్‌ను సిఫార్సు చేశారు.   


ఎలెకాన్‌ (Elecon‌)        
రేటింగ్‌: బయ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 414.95    
టార్గెట్‌ ధర: రూ. 470
స్టాప్‌ లాస్‌: రూ. 379
ఎనలిస్ట్‌: సుభాష్‌ గంగాధరన్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌    
ఎనలిస్ట్‌ ఏం చెప్పారు?: గత వారం, బలమైన వాల్యూమ్స్‌తో టైట్‌ రేంజ్‌ నుంచి ఈ స్టాక్‌ బయటపడింది, అప్‌వార్డ్‌ మొమెంటానికి ఇది గుర్తు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.