Best Credit Cards For Online Shopping: మన దేశంలో, ఆన్‌లైన్‌ మార్కెట్‌లో జరిగినన్ని లావాదేవీలు ఫిజికల్‌ మార్కెట్‌లో కూడా జరగడం లేదేమో. ఇప్పుడు ఏం కొనాలన్నా ప్రజలు క్రెడిట్‌ కార్డ్‌ తీస్తున్నారు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. జనానికి బయట తిరిగే ఓపిక & సమయం లేకపోవడం, ఇ-కామర్స్ మార్కెట్‌ ప్లేస్‌లో వేలకొద్దీ ప్రొడక్ట్స్‌ ఉండడం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించడం వంటివి ఈ ట్రెండ్‌ పెరగడానికి కారణం. ఇప్పుడు, ప్రజలు కొత్తిమీర నుంచి కొరమీను వరకు, ఉప్పు నుంచి ఊరగాయ వరకు, టాయిలెట్‌ క్లీనర్‌ నుంచి టీవీ వరకు చాలా వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. 


ఆన్‌లైన్‌ షాపింగ్‌ స్పేస్‌లో పెరుగుతున్న ఆర్డర్లను అవకాశంగా మార్చుకోవడానికి బ్యాంకులు, NBFCలు ప్రత్యేక ఫీచర్లతో క్రెడిట్ కార్డ్‌లు అందిస్తున్నాయి. కో-బ్రాండెడ్ కార్డ్‌లతో కస్టమర్‌లను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్డ్‌లతో షాపింగ్‌ చేస్తే డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌లు, రివార్డ్‌ పాయింట్స్‌ రూపంలో అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. 


ఆన్‌లైన్ షాపింగ్ కోసం బ్యాంక్‌లు లాంచ్‌ చేసిన స్పెషల్‌ క్రెడిట్ కార్డ్‌లు:


హెచ్‌డీఎఫ్‌సీ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్ (HDFC MoneyBack+ Credit Card) ఫీచర్లు


జాయినింగ్ ఫీజ్‌: రూ. 500 -  యాన్యువవల్‌ ఫీజ్‌: రూ 500
- ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్విగ్గీ, రిలయన్స్‌ సూపర్‌స్టోర్‌, బిగ్‌ బాస్కెట్‌లో ఈ కార్డ్‌ ద్వారా కొంటే 10X క్యాష్‌ పాయింట్‌లు
- EMIలపై 5X క్యాష్‌ పాయింట్‌లు
ఫ్యూయల్‌, వాలెట్ రీలోడ్, ప్రీపెయిడ్ కార్డ్ లోడ్‌, వోచర్ కొనుగోళ్లు మినహా మిగిలిన చోట్ల ఖర్చు చేస్తే, ప్రతి రూ.150కి 2 క్యాష్‌ పాయింట్‌లు
1 క్యాష్‌ పాయింట్ రూ.0.25కి సమానం
రూ.400 నుంచి రూ.5,000 వరకు ఇంధనం కొంటే 1% సర్‌ఛార్జ్ మినహాయింపు


హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ (HDFC Millennia Credit Card) ఫీచర్లు


జాయినింగ్ ఫీజ్‌: రూ. 1,000 -  యాన్యువవల్‌ ఫీజ్‌: రూ 1,000
ప్రతి త్రైమాసికంలో కనీసం రూ.1 లక్ష ఖర్చు చేస్తే రూ.1,000 విలువైన ఓచర్
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, బుక్‌మైషో, కల్ట్‌.ఫిట్‌, మింత్ర, సోనీ లివ్‌, టాటా క్లిక్‌, ఉబర్‌, జొమాటోలో కొంటే 5% క్యాష్‌ బ్యాక్‌
EMI, వాలెట్ లావాదేవీలతో సహా అన్ని ఖర్చులపై (ఇంధనం మినహా) 1% క్యాష్‌ బ్యాక్‌
త్రైమాసికానికి కనీసం రూ.1 లక్ష ఖర్చు చేస్తే సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ విజిట్స్‌
రూ.400 నుంచి రూ.5,000 వరకు ఫ్యూయల్‌ కొంటే, నెలకు రూ.250 వరకు లేదా 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు


యాక్సిస్ బ్యాంక్ ఏస్‌ క్రెడిట్ కార్డ్ (Axis Bank ACE Credit Card) ఫీచర్లు


జాయినింగ్ ఫీజ్‌: రూ. 499 -  యాన్యువవల్‌ ఫీజ్‌: రూ 499
గూగుల్‌ పే ద్వారా చేసే బిల్లు చెల్లింపులు, DTH రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్‌లపై 5% క్యాష్‌ బ్యాక్‌
స్విగ్గి, జొమాటో ఓలా లావాదేవీలపై 4% క్యాష్‌ బ్యాక్‌
అన్ని రకాల ఇతర ఖర్చులపై 1.5% క్యాష్‌ బ్యాక్‌
ఖర్చుల ఆధారంగా ఏడాదికి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ విజిట్స్‌
రూ.400 నుంచి రూ.4,000 వరకు ఇంధనం కొంటే 1% సర్‌ఛార్జ్ మినహాయింపు


క్యాష్‌ బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్ (Cashback SBI Card) ఫీచర్లు


జాయినింగ్ ఫీజ్‌: రూ. 999 -  యాన్యువవల్‌ ఫీజ్‌: రూ 999
అన్ని ఆన్‌లైన్ వ్యయాలపై 5% క్యాష్‌ బ్యాక్‌
అన్ని ఆఫ్‌లైన్ వ్యయాలపై 1% క్యాష్‌ బ్యాక్‌
రూ.500 నుంచి రూ.3,000 వరకు ఇంధనం కొంటే 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు
గత సంవత్సరంలో కనీసం రూ.2 లక్షల ఖర్చు చేస్తే యాన్యువల్‌ ఫీజ్‌ రద్దు


అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ (Amazon Pay ICICI Credit Card) ఫీచర్లు


జాయినింగ్ ఫీజ్‌: లేదు -  యాన్యువవల్‌ ఫీజ్‌: లేదు
జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్
అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ప్రైమ్ కస్టమర్‌లకు 5% క్యాష్‌ బ్యాక్‌
అమెజాన్‌లో షాపింగ్ చేస్తే నాన్-ప్రైమ్ కస్టమర్‌లకు 3% క్యాష్‌ బ్యాక్‌
అమెజాన్‌ 100+ పార్ట్‌నర్‌ మర్చంట్స్‌ నుంచి కొంటే 2% క్యాష్‌ బ్యాక్‌
ఇతర అన్ని లావాదేవీలపై 1% క్యాష్‌ బ్యాక్‌
ఐసీఐసీఐ బ్యాంక్ పార్ట్‌నర్‌ రెస్టారెంట్లలో బిల్‌పై 15% డిస్కౌంట్‌
అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు


మరో ఆసక్తికర కథనం: యూపీఐ లైట్‌, ఫాస్టాగ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ - చెల్లింపుల్లో ఇబ్బందులకు చెల్లుచీటీ