Penalty on TCS: టాటా గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (Tata Consultancy Services - TCS) వారం వ్యవధిలోనే రెండు గట్టి షాక్‌లు తగిలాయి. ఈ ఐటీ జెయింట్‌కు, ఒక అమెరికన్‌ కోర్టు 210 మిలియన్ డాలర్ల జరిమానా ($210 million penalty on TCS) విధించింది. DXC టెక్నాలజీ కేసులో (DXC Technology case) ఈ ఎదురుదెబ్బ తగిలింది.


తమ కంపెనీ ట్రేడ్‌ సీక్రెట్స్‌ను టీసీఎస్‌ దొంగిలించిందని, 2019లో వేసిన లా సూట్‌లో DXC టెక్నాలజీ ఆరోపించింది. DXC టెక్నాలజీని ఇందుకు ముందు కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్‌ (CSC) అని పిలిచేవాళ్లు. తన సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా తీసుకుని, ట్రాన్స్‌అమెరికా అనుబంధ సంస్థ అయిన మనీ సర్వీసెస్‌కు దాని లైసెన్స్‌ను TCS ఇచ్చిందని దావాలో పేర్కొంది. 


అమెరికాకు చెందిన ట్రాన్స్‌అమెరికా - CSC కలిసి పని చేయడానికి 2014లో ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత, 2018లో, ట్రాన్స్‌అమెరికా నుంచి 2 బిలియన్‌ డాలర్ల డీల్‌ను TCS గెలుచుకుంది. అదే ఏడాది, 2,200 మంది ట్రాన్స్‌అమెరికా ఉద్యోగులను టీసీఎస్‌ తీసుకుంది. తన (CSC) సాఫ్ట్‌వేర్‌ కోసం ఆ ఉద్యోగుల యాక్సెస్‌ను TCS ఉపయోగించుకుందని తన దావాలో DXC వెల్లడించింది. 


ఈ కేసును విచారించిన టెక్సాస్‌ కోర్టు, టీసీఎస్‌కు 210 మిలియన్ డాలర్ల జరిమానా పెనాల్టీ విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు మీద టీసీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. 


వారం క్రితమే $140 మిలియన్ల జరిమానా
కేవలం వారం రోజుల క్రితం, US సుప్రీంకోర్టులోనూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎపిక్ సిస్టమ్స్ (Epic Systems) పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, టీసీఎస్‌కు 140 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. తన మేధో సంపత్తిని (intellectual property) భారతీయ కంపెనీ దొంగిలించిందని ఆ కేసులో ఎపిక్ సిస్టమ్స్ ఆరోపించింది. 


యూఎస్‌ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY24) 125 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు టీసీఎస్‌ ప్రకటించింది. ఇప్పుడు టెక్సాస్‌ కోర్టు విధించిన జరిమానాను కూడా దీనికి కలిపితే, Q3లో టీసీఎస్‌ లాభంపై మొత్తం 335 మిలియన్‌ డాలర్ల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.


ఈ రోజు (మంగళవారం, 28 నవంబర్‌ 2023) ఉదయం 11.40 గంటల సమయానికి, టీసీఎస్‌ షేర్‌ ప్రైస్‌ ‍‌(TCS share price today) రూ.23.20 లేదా 0.67% తగ్గి రూ.3,434.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జొమాటో మాత్రమే హీరో, మిగిలిన కంపెనీల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఏడుస్తున్నారు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply