Tata Boeing Aerospace: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ TBAL అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ ఫెసిలిటీ నుంచి ౩౦౦ వ హెలికాప్టర్ Fuselage ( హెలికాఫ్టర్ ప్రధానమైన బాడీ) ను డెలివరీ చేశారు. దీనిని TBAL ఫెసిలిటీలో సెలబ్రేట్ చేసుకున్నారు.
టాటా బోయింగ్ జాయింట్ వెంచర్
అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్, ఇండియన్ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. Boing, Tata Advanced Systems LTD (TASL) రెండూ కలిసి 2016లో హైదరాబాద్ లో TATA BOING AEROSPACE LTD ( TBAL) ను ఏర్పాటు చేశాయి. 2018నుంచి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానంగా బోయింగ్ కంపెనీ AH 64 APACHE కాంబాట్ హెలికాఫ్టర్ (fuselage) ప్రధానమైన బాడీలను నిర్మిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ సంస్థ విక్రయించే AH 64 APACHE హెలికాప్టర్ల fuselageలు ఇక్కడ నుంచే డెలివరీ అవుతాయి.
AH 64 APACHE ప్రపంచంలోనే అత్యంత అధనాతమైన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్. యుఎస్ ఆర్మీ దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 16దేశాలు తమ డిఫెన్స్ ఫ్లీట్ లో ఉంచాయి.ఇండియన్ ఆర్మీలో 22 అపాచీ హెలికాప్టర్లున్నాయి. మరో 6 హెలికాప్టర్ల కోసం బోయింగ్‌తో ఒప్పందం జరిగింది. ౩౦౦వ డెలివరీ ఇవ్వడం ద్వారా గ్లోబల్ డిఫెన్స్ అవసరాలను తీర్చడంతో పాటు ఇండియన్ డిఫెన్స్ సామర్థ్యాన్ని హైదరాబాద్ ఫెసిలీటీ మరింత సుస్థిరం చేస్తుందని TBAL పేర్కోంది.
మొత్తం దేశీయంగానే…
హైదరాబాద్ కేంద్రంలో మొత్తం 900మందికి పైగా ఇంజనీర్లు టెక్నిషియన్లు ఉన్నారు. ఈ పరికరాలను నిర్మాణం అంతా కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో తయారవుతోంది. 90శాతం పరికరాలను దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా చిన్న చిన్న పరిశ్రమల సేకరిస్తున్నారు. TBALలో ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలో రెబోటిక్ ఆటేమేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల ద్వారా fuselage ఉత్పత్తి చేస్తారు. మొదట్లో వేరే కేంద్రాల్లో ఈ హెలికాప్టర్ బాడీలను ఉత్పత్తి చేసినప్పటికీ ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ అపాచీ హెలికాప్టర్ బాడీలను అందిస్తున్న ఏకైక కేంద్రం. ఈ మధ్యనే ఇక్కడ బోయింగ్ 737 విమానానికి సంబంధించిన వర్టికల్ ఫిన్‌లను కూడా రూపొందించారు.