New EMI on a Rs 50 lakh home loan: ఈ నెల ప్రారంభంలో, దేశ ప్రజలను, ముఖ్యంగా మధ్య తరగతి వర్గాన్ని సంతోషపెట్టే రెండు పెద్ద వార్తలు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. 2025 ఫిబ్రవరి 01న సమర్పించిన బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) ఆకర్షణీయమైన పన్ను ఉపశమనం ప్రకటించారు. 2025-26 కోసం ప్రకటించిన బడ్జెట్‌లో, వ్యక్తులకు, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చారు. అద్దెపై TDS మినహాయింపు పరిమితిని రూ. 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. ఆ తర్వాత... 2025 ఫిబ్రవరి 07న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో రేటు (RBI Repo Rate)లో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టి & 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. రెపో రేట్‌ తగ్గడం వల్ల బ్యాంక్‌లు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గితే, ఇప్పటికే తీసుకున్న రుణాలు & భవిష్యత్‌లో తీసుకోబోయే లోన్‌లపై EMI కూడా తగ్గుతుంది. కాబట్టి, ఇది గృహ రుణ గ్రహీతలకు పెద్ద మొత్తంలో పొదుపును అందిస్తుంది. ఈ విధంగా, వారం రోజుల వ్యవధిలో దేశ ప్రజలు రెండు పెద్ద వార్తలు విన్నారు.

గృహ రుణంపై 10 EMIల పొదుపుబ్యాంక్‌బజార్‌.కామ్‌ సీఈవో ఆదిల్ శెట్టి చెప్పిన లెక్క ప్రకారం, “ఒక వ్యక్తి రూ. 50 లక్షల గృహ రుణాన్ని 20 సంవత్సరాల కాలానికి & 8.75 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నాడు అనుకుందాం. అతను మార్చి 2025 వరకు 12 EMIలు చెల్లించాడని భావిద్దాం.  రెపో రేట్‌ తగ్గింపు ప్రకారం, ఏప్రిల్ నుంచి గృహ రుణంపై వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గింది అనుకుంటే, ఇప్పుడు వడ్డీ రేటు 8.50 శాతం అవుతుంది. ఈ వడ్డీ రేట్‌ ప్రకారం, గృహ రుణంపై ప్రతి లక్ష రూపాయలకు 8,417 రూపాయలు ఆదా (Saving On Home Loan EMI) అవుతుంది. ఈ లెక్కన... రూ. 50 లక్షల రుణంపై మొత్తం 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ. 4.20 లక్షల పైగా ఆదా అవుతుంది. అంటే 10 EMIలు తగ్గుతాయి. ఇతర పరిస్థితులు స్థిరంగా ఉండి, గృహ రుణంపై వడ్డీ రేటు తగ్గింది అని ఊహిస్తూ ఆదిల్ శెట్టి ఈ అంచనాను రూపొందించారు. 

బలమైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్‌లకు 50 బేసిస్ పాయింట్లు తగ్గిందని భావిస్తే... మిగిలిన రుణ కాలానికి 8.25 శాతం వడ్డీతో (8.75 శాతం - 0.5 శాతం), ప్రతి లక్ష రూపాయలకు రూ. 14,480 వరకు పొదుపు చేసుకోవచ్చు అని ఆదిల్ శెట్టి వివరించారు. ఏప్రిల్ 01, 2025 నుంచి వడ్డీ రేటు తగ్గింపులు అమలులోకి వస్తే, రుణగ్రహీత, తాను చెల్లించే వడ్డీపై ప్రతి లక్ష రూపాయలకు రూ. 3,002 ఆదా చేసుకోగలగడు. అంటే, రూ. 50 లక్షల రుణంపై, రెండో సంవత్సరంలోనే రూ. 1.50 లక్షల పొదుపు ఉంటుంది.

ప్రస్తుత & కొత్త కస్టమర్లు ఇద్దరికీ లాభంగృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను ప్రస్తుత రుణగ్రహీతలతో పాటు కొత్తగా లోన్‌లు తీసుకునే వ్యక్తులు ఈ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల EMIతో పాటు ఆర్థిక భారం తగ్గుతుంది. 

ఇప్పటికే రుణం తీసుకున్న వాళ్లు తక్కువ వడ్డీ రేటు ప్రయోజనం పొందడానికి లోన్‌ రీఫైనాన్స్ (Loan Refinance) గురించి ఆలోచించవచ్చు. అంటే, మీ బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ కంటే తక్కువ వడ్డీకి లోన్‌ ఆఫర్‌ చేస్తున్న వేరే 0బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీకి మీ లోన్‌ను బదిలీ చేసుకోవచ్చు & తక్కువ వడ్డీ రేటు ప్రయోజనాన్ని ఆస్వాదించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: రూ.88,000 దిశగా పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ