టాటా త్వరలో లాంచ్ చేయనున్న అల్ట్రోజ్ డీసీఏ కారు గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఆటోమేటిక్ అల్ట్రోజ్ కారు మార్చి నెలాఖరులోపు మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అల్ట్రోజ్‌కు డీసీటీ ఆటోమేటిక్ వెర్షనే ఈ అల్ట్రోజ్ డీసీఏ.ఇందులో వెట్ క్లచ్‌ను అందించారు. కేవలం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.


మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కూడా ఇందులో అందించే అవకాశం ఉంది. టర్బో పెట్రోల్‌లో డీసీఏ వేరియంట్ అందుబాటులో ఉంటే దాని ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆల్ట్రోజ్ డీసీఏలో చిన్న అవుట్‌పుట్ అందించే 1.2 లీటర్ ఇంజిన్‌ను అందిస్తున్నారు.


ఆల్ట్రోజ్‌లో 1.2 లీటర్ స్టాండర్డ్ వేరియంట్ చాలా పాపులర్ ఆప్షన్ కాబట్టి ఇది మంచి నిర్ణయమే అనుకోవచ్చు. ఈ సమయంలో దానికి టర్బో పెట్రోల్ కంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఇంకా అవసరం. ఆల్ట్రోజ్ డీసీఏ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.21 వేలు చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు.


ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్+ వేరియంట్లలో దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ మూడు వేరియంట్లలోనూ 1.2 లీటర్ రెవట్రోన్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీంతోపాటు ఒపేరా బ్లూ అనే కొత్త వేరియంట్లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు డౌన్‌టౌన్ రెడ్, ఆర్కాడ్ గ్రే, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు డార్క్ ఎడిషన్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది.


ఆల్ట్రోజ్ డీసీఏ... బలెనో ఏఎంటీ, ఐ20 సీవీటీ ఆటోమేటిక్‌లతో పోటీ పడనుంది. 1.2 లీటర్ ఐ20లో సీవీటీ ఆప్షన్ ఉంది. టాప్ ఎండ్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్‌లో డీసీటీని అందించారు. డీసీఏ ఆల్ట్రోజ్ ధర కూడా మాన్యువల్ అల్ట్రోజ్ ధర కంటే రూ.లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.