Stock Market Today, 29 January 2024: ఆసియా మార్కెట్ల మీదుగా సానుకూల పవనాలు వీస్తుండడంతో, ఈ రోజు (సోమవారం) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పచ్చగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 93 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 21641 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు


ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం హాంగ్ సెంగ్ 1.5 శాతానికి పైగా పెరిగింది. కోస్పి 1 శాతం, నికాయ్‌ 0.8 శాతం లాభంలో ఉన్నాయి. షాంఘై, స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ కూడా హయ్యర్‌ సైడ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి.
 
శుక్రవారం, ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో US మార్కెట్‌ మిశ్రమంగా ముగిసింది. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగితే.. S&P 500, నాస్‌డాక్ వరుసగా 0.1 శాతం, 0.4 శాతం పడిపోయాయి.


US బెంచ్‌మార్క్‌ 10-ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 4.141 శాతానికి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $83 పైకి చేరింది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ITC, బజాజ్ ఫైనాన్స్, NTPC, గెయిల్‌, BPCL, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రీన్, మారికో, భారత్ ఎలక్ట్రానిక్స్, మరికొన్ని కంపెనీలు. 


HDFC బ్యాంక్: ఈ బ్యాంక్‌లో వాటాను ప్రస్తుతమున్న 5.19 శాతం నుంచి 9.99 శాతానికి పెంచుకోవడానికి LICకి రిజర్వ్‌ బ్యాంక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


SBI కార్డ్స్‌: Q3 లాభం 7.8 శాతం పెరిగి రూ.549 కోట్లకు చేరుకుంది. ఆదాయం 31.8 శాతం పెరిగి రూ.4,622 కోట్లుగా నమోదైంది.


అదానీ పవర్: డిసెంబర్‌ త్రైమాసికం లాభం ఏడాది క్రితంలోని రూ. 8.8 కోట్ల నుంచి రూ. 2,738 కోట్లకు పెరిగింది, ఇది 300 రెట్లు జంప్‌. ఏకీకృత ఆదాయం 67.3 శాతం వృద్ధితో రూ.12,991 కోట్లకు చేరుకుంది. తన పూర్తి యాజమాన్యంలోని రెండు అనుబంధ సంస్థలను అదానీకానెక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.540 కోట్లకు అమ్మేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 


టాటా టెక్నాలజీస్: డిసెంబర్‌ క్వార్టర్‌ లాభం, గత సంవత్సరం ఇదే కాలంతో (YoY) పోలిస్తే 14.7 శాతం జంప్‌తో రూ.170.22 కోట్లు నమోదైంది. ఆదాయం కూడా 14.7 శాతం వద్ధితో రూ.1,289.5 కోట్లకు చేరుకుంది.


వేదాంత: గత ఏడాదితో పోలిస్తే, Q3 FY24 లాభం 18.3 శాతం క్షీణించి రూ.2,013 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం గణాంకాల్లో రూ.903 కోట్ల ఏకకాల లాభం కలిసి ఉంది. Q3 FY24లో ఆదాయం 4.2 శాతం పెరిగి రూ.35,541 కోట్లకు చేరుకుంది.


కోల్ ఇండియా: గుజరాత్‌లోని ఖవ్డాలో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ కోసం అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


DLF: హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం గురుగావ్‌లో 29 ఎకరాల భూమిని సేకరించనుంది.


లారస్ ల్యాబ్స్: స్లోవేనియాకు చెందిన క్రకా ఫార్మాతో కలిసి 49:51 వాటాలతో హైదరాబాద్‌లో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తోంది.


SJVN: యూనిట్‌కు రూ.2.54 చొప్పున, బిల్డ్-ఓన్ అండ్‌ ఆపరేట్ ప్రాతిపదికన 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ బిడ్‌ గెలుచుకుంది.


స్ట్రైడ్స్ ఫార్మా: సింగపూర్ యూనిట్‌ ఉత్పత్తి చేసిన  ప్రిగాబాలిన్ క్యాప్సూల్స్‌కు US FDA ఆమోదం లభించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.63 వేల దగ్గర ఆగిన గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే