Stock Market Today, 26 April 2024: గ్లోబల్‌ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తుండడంతో ఈ రోజు (శుక్రవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభం కావచ్చు. నిన్న వెల్లడైన US GDP డేటా నిరాశపరిచింది, అంచనాల కంటే తగ్గింది. మొదటి త్రైమాసికంలో 2.4 శాతం వృద్ధి ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తే, కేవలం ప్రకారం 1.6 శాతం వృద్ధి సాధ్యమైంది.


మంగళవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,570 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,690 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 0.32 శాతం పెరిగింది, టోపిక్స్ ఇండెక్స్ 0.07 శాతం పైకి జరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి 0.86 శాతం ర్యాలీ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 1.27 శాతం పడిపోయింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాం గ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 1.15 శాతం లాభపడింది.


యూఎస్‌ డీజీపీ డేటా మార్కెట్‌ అంచనాలను మిస్‌ చేయడంతో అక్కడి మార్కెట్లు నిన్న పడిపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.98 శాతం నష్టపోయింది. S&P 500 0.46 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.64 శాతం తగ్గింది.


యూఎస్‌ GDP రిపోర్ట్‌ తర్వాత అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 5 నెలల గరిష్టానికి పెరిగింది, ప్రస్తుతం 4.70 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1% జంప్‌ చేసి $89 పైకి చేరింది. గోల్డ్ కూడా రైజింగ్‌లో ఉంది, ఔన్సుకు $2,344 దగ్గరకు చేరింది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: మారుతి సుజుకి, HCL టెక్నాలజీస్, SBI లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI కార్డ్స్, సుప్రీం ఇండస్ట్రీస్, అతుల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, KSB, మహీంద్ర హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఉషా మార్టిన్, మాస్టెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా, VST ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్.


టెక్ మహీంద్రా: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్ర, నాల్గవ త్రైమాసికంలో రూ.661 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏక సమయ ఖర్చుల కారణంగా లాభం YoYలో 41 శాతం పడిపోయింది. QoQలో 29.5 శాతం పెరిగింది. అయితే, బ్లూమ్‌బెర్గ్ అంచనా రూ. 741 కోట్ల కంటే తక్కువగా ఉంది.


బజాజ్ ఫైనాన్స్: 2024 మార్చి త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ లాభం అంచనాలను మించి సంవత్సరానికి (YoY) 21 శాతం పెరిగింది, రూ. 3,825 కోట్లుగా నమోదైంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) 34 శాతం పెరిగి రూ. 3.31 లక్షల కోట్లకు చేరాయి.


ఇండస్‌ఇండ్ బ్యాంక్: Q4 FY24లో బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం 15 శాతం జంప్‌ చేసి రూ. 2,349 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం పెరగడం వల్ల లాభం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రుణదాత రూ.2,043 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.


సైయెంట్‌: FY24 నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 28.5 శాతం వృద్ధితో రూ.196.9 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.1,861 కోట్లకు పెరిగింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: UTI AMC, షాఫ్లర్‌ ఇండియా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ప్రైమ్ సెక్యూరిటీస్, సోమ్ డిస్టిలరీస్, టాన్లా ప్లాట్‌ఫామ్స్‌, ఆవాస్ ఫైనాన్షియర్స్, జెన్సార్ టెక్నాలజీస్, కెపీఐ గ్రీన్ ఎనర్జీ, LTTS. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: 70 ఎయిర్‌బస్ A350 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 30 ఎయిర్‌బస్ A350-900 విమానాల కోసం ఇండిగో ఆర్డర్ చేసింది. ఈ డీల్‌ విలువ 4-5 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.


బయోకాన్: బయోకాన్ ఫార్మాతో బయో-ఫ్యూజన్ థెరప్యూటిక్స్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదించింది.


లారస్ ల్యాబ్స్: FY24 కోసం ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.0.4 (20%) చొప్పున డివిడెండ్ చెల్లింపు కోసం మే 08ని రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మరింత తగ్గిన పసిడి ప్రకాశం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి