Stock Market Today, 24 April 2024: గ్లోబల్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో ఈ రోజు (బుధవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు లాభాల పరంపరను కొనసాగించాలని చూస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్‌ మధ్య గొడవలు సడలడంతో ప్రపంచ మార్కెట్లలో మంచి వాతావరణం కనిపిస్తోంది. 


మంగళవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,368 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,449 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం, జపాన్‌లోని నికాయ్‌ 2 శాతం ర్యాలీ చేసింది. కోస్పి, తైవాన్ 1.7 శాతం చొప్పున పెరిగాయి. హాంగ్ సెంగ్ 0.9 శాతం పెరిగింది.


యూఎన్‌ మార్కెట్లలో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.69 శాతం పెరిగింది. S&P 500 1.2 శాతం లాభపడింది. నాస్డాక్ కాంపోజిట్ 1.59 శాతం ర్యాలీ చేసింది.


యూఎస్‌ మాన్యుఫాక్చరింగ్‌ డేటా తర్వాత అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పెరిగింది, ప్రస్తుతం 4.619 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $88 పైకి చేరింది. గోల్డ్ తగ్గుతోంది, ఔన్సుకు $2,330 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, దాల్మియా భారత్, మాక్రోటెక్ డెవలపర్లు, ఇండియన్ హోటల్స్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సింజీన్ ఇంటర్నేషనల్, DCB బ్యాంక్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్, సుప్రీమ్ పెట్రోకెమ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, అనంత్ రాజ్


టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: FY24లో అనుకోని వ్యయాల కారణంగా ఈ కంపెనీ నికర లాభం 19.3 శాతం తగ్గి రూ.217 కోట్లకు పరిమితమైంది. అదే త్రైమాసికంలో ఆదాయం 8.5 శాతం పెరిగి రూ. 3,927 కోట్లకు చేరుకుంది. భారతదేశ వ్యాపారంలో బలమైన పనితీరు కనిపించింది, 10 శాతం పెరిగింది.


ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్: 2024 మార్చి త్రైమాసికంలో పెరిగిన వ్యయాల కారణంగా కంపెనీ నికర లాభంలో 26 శాతం YoY తగ్గి, రూ. 173.76 కోట్లుగా నమోదైంది. QoQలో నికర లాభం దాదాపు 23 శాతం పడిపోయింది. కొత్త వ్యాపారం (VNB) విలువ 26.44 శాతం YoY తగ్గి రూ. 776 కోట్లకు చేరుకుంది. VNB మార్జిన్ కూడా Q4 FY23లోని 31.97 శాతంతో పోలిస్తే Q4 FY24లో 21.46 శాతానికి పడిపోయింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: MCX, Huhtamaki, అక్షిత కాటన్, 360 వన్‌ WAM, టాటా ఎల్‌క్సీ, నెల్కో. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


IIFL ఫైనాన్స్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన విధంగా IIFL గ్రూప్ లెండింగ్ యూనిట్ ప్రత్యేక ఆడిట్‌ ప్రారంభించింది.


SBI కార్డ్: ట్రావెల్-సెంట్రిక్ కోర్ క్రెడిట్ కార్డ్ 'ఎస్‌బీఐ కార్డ్ మైల్స్‌'ను (SBI Card MILES) లాంచ్‌ చేసింది. ట్రావెల్ క్రెడిట్స్‌ను ఎయిర్ మైల్స్, హోటల్ పాయింట్స్‌గా మార్చడం, అన్ని ట్రావెల్ బుకింగ్స్‌ మీద మెరుగైన రివార్డ్‌లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్‌ వంటి ప్రయాణ ప్రయోజనాలను ఈ కార్డ్ అందిస్తుంది.


డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: కొన్ని ప్యాకెట్లలో ఔషధం రంగు మారడం వల్ల, US మార్కెట్‌ నుంచి ఆరు లాట్ల సప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ పౌడర్‌ను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కింద పడినా పైచేయి రిలయన్స్‌దే - టార్గెట్‌ ధరలు పెంచిన బ్రోకింగ్‌ కంపెనీలు