Stock Market Today, 19 March 2024: ఈ రోజు (మంగళవారం) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లోయర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు జపాన్, ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు రెడ్‌ జోన్‌లోకి జారుకున్నాయి.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 37 పాయింట్లు లేదా 0.17 శాతం రెడ్‌ కలర్‌లో 22,060 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
జపాన్‌ సెంట్రల్ బ్యాంక్, 17 సంవత్సరాల తర్వాత ప్రతికూల వడ్డీ రేటు విధానాన్ని ముగిస్తుందన్న అంచనాల నడుమ ఇప్పుడు అందరి దృష్టి బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌పైనే ఉంది. ఈ ఉదయం నికాయ్‌ 0.7 శాతం పడిపోయింది. హాంగ్ సెంగ్, కోస్పి కూడా 1 శాతం పైగా తగ్గాయి.


నిన్న, యూఎస్‌ మార్కెట్లు మాత్రం లాభాల్లో క్లోజ్‌ అయ్యాయి. డౌ జోన్స్‌ 0.2 శాతం, S&P 500 0.63 శాతం పెరిగాయి. నాస్‌డాక్ 0.8 శాతం ఎగబాకింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


పాపులర్‌ వెహికల్స్‌ అండ్‌ సర్వీసెస్‌: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి. IPO సమయంలో ఒక్కో షేర్‌ ఇష్యూ ధర రూ. 295.


షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్: షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి డీమెర్జ్‌ అయిన ఈ కంపెనీ, T2T కేటగిరీ కింద ఈ రోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతుంది.


TCS: టాటా సన్స్ ఈ రోజు TCSలో 0.65 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. రూ.4,001 ఫ్లోర్ ప్రైస్‌తో 23.4 మిలియన్ షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తుంది. మరోవైపు, 2024-25లో తన ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7-8 శాతం, ఆన్‌సైట్ సిబ్బందికి 2-4 శాతం జీతాలు పెంచాలని TCS యోచిస్తోంది. 


భారతి ఎయిర్‌టెల్, SBI, L&T: మూలధన వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటివాటితో దీర్ఘకాలంలో ప్రయోజనం పొందే 11 స్టాక్స్‌ను జెఫరీస్ వెల్లడించింది. ఇవి, 2029 నాటికి, ప్రస్తుత ధరకు రెట్టింపు పైగా పెరుగుతాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.


L&T ఫైనాన్స్ హోల్డింగ్స్: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ఎన్‌సీడీల ద్వారా రూ. 1.01 లక్షల కోట్ల వరకు సమీకరించేందుకు డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


టాటా స్టీల్: వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ ప్లాంట్‌లో కోక్ ఓవెన్‌‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు టాటా స్టీల్ యుకే విభాగం ప్రకటించింది. కోక్ ఓవెన్ మూసివేత ప్రభావాన్ని అధిగమించేందుకు కోక్ దిగుమతులను పెంచనున్నట్లు తెలిపింది.


ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC: ఈ కంపెనీ ప్రమోటర్లు 11.47 శాతం వాటాను (33 మిలియన్ షేర్లు) OFS మార్గంలో ఈ రోజు, రేపు అమ్మేస్తారు. OFS కోసం ఫ్లోర్‌ ప్రైస్‌గా ఒక్కో షేరుకు రూ.450 నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఇది 5 శాతం డిస్కౌంట్‌.


జెనెసిస్ ఇంటర్నేషనల్: వెరిటాస్‌తో (ఇండియా) కలిసిన కన్సార్టియం, BMC నుంచి రూ.156 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ అవార్డ్‌ అందుకుంది.


హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్: జోధ్‌పూర్ విద్యుత్ వితరణ్‌ నిగమ్ నుంచి రూ.1,026 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ అవార్డ్‌ అందుకుంది.


IOL కెమికల్స్: పంజాబ్‌లోని మొత్తం 10 API యూనిట్లలో బ్రెజిలియన్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ANVISA) తనిఖీ విజయవంతంగా పూర్తయింది, ఎలాంటి పరిశీలనలు జారీ కాలేదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి