Stock Market Today, 18 May 2024: వాల్ స్ట్రీట్ లాభాలను ట్రాక్ చేస్తూ భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శనివారం) పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చు. ఇండియన్‌ మార్కెట్‌లో FIIల సెల్లాఫ్‌ ముగిసింగి, నిన్న నెట్‌ బయ్యర్స్‌గా మారారు. శుక్రవారం ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,616.79 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, DIIలు నికరంగా రూ. 1,556 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.


శుక్రవారం సెషన్‌లో నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,466 దగ్గర క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌ 253 పాయింట్లు పెరిగి 73,917 దగ్గర ఆగింది.


గ్లోబల్‌ మార్కెట్లు
యుఎస్‌లో, నిన్న, డౌ జోన్స్ చరిత్రాత్మక 40,000 స్థాయికి ఎగువన ముగిసింది, ఈ ఫీట్‌ సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఇండెక్స్‌ 0.34 శాతం పెరిగింది. S&P 500 సూచీ 0.12 శాతం లాభపడింది. అయితే, నాస్‌డాక్ కాంపోజిట్ 0.07 శాతంతో స్వల్పంగా తగ్గింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.422 శాతానికి చేరింది. డిమాండ్‌ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $84 వద్ద ఉంది. చైనా, యూఎస్‌ ఆర్థిక డేటాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఒకసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,419 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


అపోలో టైర్స్: గ్రీన్ ఇన్‌ఫ్రా విండ్ ఎనర్జీ జనరేషన్‌లో 5.09 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు టైర్ల కంపెనీ ప్రకటించింది.


వొడాఫోన్‌ ఐడియా: సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి 4G సర్వీస్ కవరేజీని విస్తరించేందుకు మూలధన వ్యయాన్ని కేటాయిస్తోంది. 5G సేవలు తీసుకొచ్చామని, భవిష్యత్తులో వృద్ధి & పోటీ కోసం సిద్ధంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది.


జైడస్‌ లైఫ్‌: Q4 FY24లో కంపెనీ లాభం రూ. 1,182 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 296 కోట్లుగా ఉంది. ఆదాయం 10 శాతం పెరిగి రూ.5,533 కోట్లకు చేరింది.


JSW స్టీల్: మార్చి త్రైమాసికంలో ఉక్కు కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 64.66 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 3,741 కోట్లతో పోలిస్తే ఈసారి కేవలం రూ. 1,322 కోట్ల లాభాన్ని ఆర్జించింది.


RVNL: ప్రభుత్వ రంగ సంస్థ లాభం 33.2 శాతం పెరిగి రూ. 478.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 17.4 శాతం పెరిగి రూ. 6,714 కోట్లుగా నమోదైంది. ఎబిటా 21.8 శాతం వృద్ధితో రూ. 456.4 కోట్లకు చేరుకుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: గత ఏడాది మార్చి త్రైమాసికంలోని రూ. 196 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ. 13.4 కోట్ల లాభాన్ని సాధించింది. ఆదాయం 2.7 శాతం పెరిగి రూ.2,169 కోట్లకు, ఎబిటా 38.4 శాతం పెరిగి రూ.209 కోట్లకు చేరుకుంది.


గోద్రెజ్ ఇండస్ట్రీస్: 2024 జనవరి-మార్చి కాలంలో ఈ కంపెనీ నష్టాలను మూటగట్టుకుంది. ఏడాది క్రితం నాటి రూ. 300.1 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి రూ. 321.8 కోట్ల నికర నష్టాన్ని రిపోర్ట్‌ చేసింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ. 4,567.3 కోట్లకు పరిమితమైతే, ఎబిటా 23.6 శాతం తగ్గి రూ. 457.8 కోట్లకు దిగి వచ్చింది.


షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: 2023-24 నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.307 కోట్లకు పడిపోయింది, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 380 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 1,420 కోట్ల నుంచి రూ. 1,413 కోట్లకు స్వల్పంగా తగ్గింది. ఎబిటా కూడా రూ. 465 కోట్ల నుంచి రూ. 407 కోట్లకు పరిమితమైంది.


బంధన్ బ్యాంక్: Q4 FY24లో పెరిగిన ప్రొవిజన్స్‌, రైటాఫ్‌ల కారణంగా ఈ ప్రైవేట్ బ్యాంక్‌ లాభం అతి భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.808.3 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.54.6 కోట్లకు పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గగ్గోలు పుట్టిస్తున్న గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి