Stock Market Today, 15 March 2024: ఈ రోజు (శుక్రవారం) గ్లోబల్‌ మార్కెట్ల మూడ్‌ బాగోలేదు. గురువారం ట్రేడింగ్‌లో కదం తొక్కిన స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు అదే ఊపును కొనసాగించలేకపోవచ్చు. అమెరికా టోకు ద్రవ్యోల్బణంలో ఊహించిన దాని కంటే ఎక్కువ వృద్ధి కారణంగా గ్లోబల్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. 


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 148 పాయింట్లు లేదా 0.68 శాతం రెడ్‌ కలర్‌లో 22,147 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
US ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ 0.3 శాతం పెరుగుతుందని అంచనా వేస్తే, ఊహించని విధంగా 0.6 శాతం పెరిగింది. దీంతో, US 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌ను 10 bps పెరిగి 4.29 శాతానికి చేరింది. ఈ ఎఫెక్ట్‌తో డౌ జోన్స్ 0.35 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.3 శాతం తగ్గింది. S&P 500 0.29 శాతం క్షీణించింది.


ఆసియా మార్కెట్లు కూడా ఈ ఉదయం రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.45 శాతం దిగి వచ్చింది. హాంగ్ సెంగ్, ASX 200, కోస్పి దాదాపు 1 శాతం చొప్పున క్షీణించాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు: 22 నెలల తర్వాత పెట్రోల్ & డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ రెండు ఇంధనాల రేటు ఈ రోజు నుంచి రూ.2 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు 85 డాలర్ల దగ్గర ఉన్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం OMCలకు మింగుడు పడకపోవచ్చు. ఈ నేపథ్యంలో.. చమురు మార్కెటింగ్ కంపెనీలు BPCL, HPCL, IOL స్టాక్స్‌ ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. 


పేటీఎం: SBI, యాక్సిస్‌ బ్యాంక్‌, HDFC బ్యాంక్, యెస్‌ బ్యాంక్ ద్వారా UPI చెల్లింపుల్లో థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా పని చేయడానికి పేటీఎంకు NPCI అనుమతి లభించింది.


బయోకాన్‌, మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌: ఈ కంపెనీల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు - ఇంద్రనీల్ సేన్ (బయోకాన్‌), సత్య కిషోర్ నడికట్ల (మోల్డ్-టెక్ టెక్నాలజీస్) రాజీనామా చేశారు.


బయోకాన్, ఎరిస్ లైఫ్‌సైన్సెస్: బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్‌కు చెందిన ఇండియా-బ్రాండెడ్ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ.1,242 కోట్లకు ఎరిస్ లైఫ్‌సైన్సెస్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ఇన్సులిన్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్‌ పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి.


IIFL ఫైనాన్స్: కొత్త గోల్డ్ లోన్ల మంజూరు నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిన నేపథ్యంలో, ఫిచ్ రేటింగ్స్ IIFL ఫైనాన్స్‌ను 'రేటింగ్ వాచ్ నెగెటివ్'లో ఉంచింది.


క్రాంప్టన్ గ్రీవ్స్: PM-KUSUM పథకం కింద PV మాడ్యూల్స్‌తో కూడిన సోలార్ ఫోటోవోల్టాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ (SWPS) సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమీషన్ కోసం మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి ఈ కంపెనీకి ఆర్డర్లు వచ్చాయి.


రైల్‌టెల్ కార్పొరేషన్: ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ (OCAC) నుంచి రూ.113.46 కోట్ల వర్క్ ఆర్డర్‌ అందుకుంది.


ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: క్వాంటాస్ ఎయిర్‌వేస్‌తో ఒప్పందంలో భాగంగా, ఆస్ట్రేలియాలోని 11 కొత్త కోడ్‌షేర్ మార్గాల్లో సర్వీసులు ప్రారంభించింది.


శక్తి పంప్స్‌: మహారాష్ట్ర ఇంధన శాఖ నుంచి ఈ కంపెనీ రూ.93 కోట్ల ఆర్డర్‌ అందుకుంది.


సియట్: మిలింద్ సర్వాటేను ఐదేళ్ల కాలానికి నాన్-ఎగ్జిక్యూటివ్, ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్‌గా నియమించేందుకు సియట్ బోర్డు ఆమోదం తెలిపింది. 


TVS మోటార్: ఈ కంపెనీ సింగపూర్ విభాగం, అయాన్ మొబిలిటీలో 5.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.66,000 పైనే పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే