Stock Market Today, 13 March 2024: భారత్‌తో పాటు అమెరికాలో ఆశించిన స్థాయిలోనే ద్రవ్యోల్బణం నమోదు కావడంతో ఈ రోజు (బుధవారం) ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సానుకూలంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మన దేశంలో, ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం (CPI Inflation) 5.09 శాతంగా నమోదైంది, గత నెలతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉంది, దలాల్‌ స్ట్రీట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. 


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 04 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,461 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
అమెరికాలో.. CPI ఇన్‌ఫ్లేషన్‌ MoM ప్రాతిపదికన 0.4 శాతం, YoYలో 3.2 శాతం పెరిగింది. అంచనాలకు అనుగుణంగా ఇది ఉండడంతో US సూచీలు మంగళవారం లాభపడ్డాయి. S&P500 1.12 శాతం పెరిగి 5,175.27 వద్ద సరికొత్త రికార్డును తాకింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.54 శాతం లాభపడగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.61 శాతం పెరిగింది.


ఆసియా మార్కెట్లలో.. జపాన్‌ నికాయ్‌ 0.5 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 0.13 శాతం తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ASX 200, హాంకాంగ్‌ హ్యాంగ్‌ సెంగ్ 0.2 శాతం నుంచి 0.4 శాతం వరకు పెరిగాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


JG కెమికల్స్: ఈ స్టాక్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతోంది. IPO సమయంలో ఒక్కో షేరును రూ.221 ధరకు కేటాయించారు.


ITC: బ్రిటిష్ అమెరికన్ టొబాకో (BAT), బుధవారం, బ్లాక్ డీల్స్ ద్వారా ITCలో దాదాపు 3.5 శాతం షేర్లను విక్రయించవచ్చు. ఈ డీల్‌ ద్వారా ఒక్కో షేరును రూ.384 నుంచి రూ.400.25 రేంజ్‌లో, మొత్తం 436.9 మిలియన్ షేర్లను అమ్మబోతోంది.


సిగ్నేచర్‌ గ్లోబల్ (ఇండియా): గురుగావ్‌ సెక్టార్ 93లో, తన అనుబంధ సంస్థ ద్వారా 'ఆర్చర్డ్ అవెన్యూ-3' పేరిట కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 235 యూనిట్లు ఉంటాయి, మొత్తం విస్తీర్ణం 1.66 ఎకరాలు.


జెట్ ఎయిర్‌వేస్: NCLAT, మంగళవారం, జెట్ ఎయిర్‌వేస్ రిజల్యూషన్ ప్లాన్‌కు ఓకే చెప్పింది. కంపెనీని జలాన్ కల్రాక్ కన్సార్టియంకు బదిలీ చేయడానికి ఆమోదించింది.


షాల్బీ: మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హీలర్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (హీలర్స్ హాస్పిటల్) 100 శాతం ఈక్విటీ వాటాను 104 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతోంది. నెల రోజుల వ్యవధిలో డీల్‌ ముగుస్తుంది.


ఎథోస్: సిల్వర్‌సిటీ బ్రాండ్స్ ఏజీలోని తన వాటాను 100 శాతం నుంచి 35 శాతానికి తగ్గించుకుంది. దీంతో, సిల్వర్‌సిటీ బ్రాండ్స్ AG, ఎథోస్‌కు అనుబంధ సంస్థగా మారింది.


మాగ్నమ్ వెంచర్స్: ఆల్కెమిస్ట్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌కు మొత్తం రూ.136.48 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించింది.


గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్: గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో 75 శాతం వాటా కొనుగోలును నిర్మా పూర్తి చేసింది.


లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.106.12 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కించుకుంది.


వేదాంత: డివిడెండ్ చెల్లింపులో జాప్యం చేసినందుకు, స్కాటిష్ కంపెనీ కెయిర్న్‌కు రూ.77.62 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది.


HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్: బిహార్‌లోని గయ-సోన్‌నగర్ సెక్షన్‌లో డబుల్ లైన్ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ అందుకుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.709 కోట్లు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి