Stock Market Today, 10 April 2024: నిన్న రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనక్కు వచ్చిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (బుధవారం) సానుకూలంగా ప్రారంభం కావచ్చు, మొమెంటం కొనసాగించవచ్చు.


నిన్న, నిఫ్టీ 22,642.75 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,821 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో సెంటిమెంట్‌ మిశ్రమంగా ఉంది. జపాన్‌ నికాయ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో 0.34 శాతం పడిపోయింది, టోపిక్స్ 0.20 శాతం దిగి వచ్చింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.29 శాతం స్వల్ప లాభంతో ట్రేడ్‌ ప్రారంభించింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.68 శాతం పెరిగింది. 


US మార్కెట్లలో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్లాట్‌గా ముగిసింది. అయితే.. S&P 500 0.14 శాతం పెరిగింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.34 శాతం లాభపడింది.


యూఎన్‌ ఇన్‌ఫ్లేషన్‌ డేటా నేపథ్యంలో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.35 శాతానికి దిగి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $90 దిగువుకు చేరాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,368 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


మారుతి సుజుకి: హరియాణాలోని మనేసర్‌లో ఉన్న తన ప్లాంట్‌లో కొత్త అసెంబ్లింగ్ లైన్‌ను జోడించినట్లు ఈ ఆటో కంపెనీ వెల్లడించింది. దీనివల్ల మొత్తం తయారీ సామర్థ్యం 2.25 మిలియన్ యూనిట్ల నుంచి 2.35 మిలియన్ యూనిట్లకు పెరిగింది.


పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ MD & CEO సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు కంపెనీ నిన్న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జూన్ 26 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది.


ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, PB ఫిన్‌టెక్: ఈ రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. దీనివల్ల, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను పాలసీబజార్‌ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తారు.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్: గుజరాత్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి FY19 కు సంబంధించి రూ. 20.50 లక్షలకు జీఎస్‌టి నోటీసు అందిందని ఈ కంపెనీ వెల్లడించింది.


లుపిన్: ఫార్మా మేజర్ లుపిన్‌, Oracea (డాక్సీసైక్లిన్ క్యాప్సూల్స్ 40 mg) మొదటి జెనరిక్ వెర్షన్‌ను అమెరికాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


గేట్‌వే డిస్ట్రిపార్క్స్: కంపెనీ CFO సికిందర్ యాదవ్ రాజీనామా చేశారు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రిజైన్‌ లెటర్‌లో రాశారు.


పైసాలో డిజిటల్: కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) నాలుగో త్రైమాసికంలో 32% పెరిగి రూ. 4,622 కోట్లకు చేరుకున్నాయి. డిస్‌బర్స్‌మెంట్స్‌ 38% పెరిగి రూ. 3,588 కోట్లకు చేరుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రెండ్రోజుల్లో భారతి హెక్సాకామ్ IPO లిస్టింగ్‌, GMP పరిస్థితి ఏంటి?