Stock Market Today, 07 December 2023: ఇండియన్‌ ఈక్విటీలు నిన్న (బుధవారం) కూడా, వరుసగా ఏడో సెషన్‌లో ర్యాలీని కొనసాగించాయి. నిఫ్టీ ప్రస్తుతం 21,000 మార్కును తాకేందుకు కేవలం 40 పాయింట్ల దూరంలో ఉంది.


టెక్నికల్‌గా చూస్తే.. నిఫ్టీ కన్సాలిడేషన్‌కు ఎక్కువ ఛాన్స్‌ ఉంటుంది. అప్‌మూవ్‌లో 21000-21060 స్థాయి తక్షణ నిరోధక జోన్‌గా పని చేస్తుందని, 20800-20730 కీలకమైన సపోర్ట్ జోన్‌గా ప నిచేస్తుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


నష్టాల్లో ముగిసిన US మార్కెట్లు
జాబ్‌ మార్కెట్‌ బలంగా లేదన్న సంకేతాలతో, ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది ప్రారంభంలో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించవన్న అంచనాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో యుఎస్ స్టాక్స్‌ బుధవారం డౌన్‌లో ముగిశాయి. మెగా క్యాప్స్‌, ఎనర్జీ షేర్లు అక్కడి మార్కెట్‌ను కిందకు లాగాయి. యూఎస్‌ కీలక సూచీలైన S&P 500 0.39%, నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.58%, డో జోన్స్ 0.19% పడిపోయాయి.


ఆసియా షేర్లు పతనం
వాల్ స్ట్రీట్‌లో బలహీనత ఆసియా ఈక్విటీ మార్కెట్లను కూడా దెబ్బకొట్టింది. యూఎస్‌ లేబర్ మార్కెట్ వేగం తగ్గినట్లు వచ్చిన సంకేతాలతో ట్రెజరీల్లో ర్యాలీ కొనసాగింది. జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యాయి, హాంకాంగ్ బెంచ్‌మార్క్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులు కూడా పడిపోయాయి. S&P 500లో మూడో రోజు క్షీణతను ఇది ఫాలో అయింది. హాంగ్ సెంగ్ 0.2%, జపాన్ టాపిక్స్ 0.7%, ఆస్ట్రేలియా S&P/ASX 200 0.1% పడిపోయింది. Euro Stoxx 50 ఫ్యూచర్స్ 0.8% పెరిగింది


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22 పాయింట్లు లేదా 0.10% రెడ్‌ కలర్‌లో 21,038 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


IRCON: ఈ రోజు ‍‌(గురువారం) ప్రారంభమయ్యే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా IRCON ఇంటర్నేషనల్‌లో 8% ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. 


నెట్‌వర్క్18: టీవీ, డిజిటల్ వార్తల వ్యాపారాలను ఏకీకృతం చేసేందుకు నెట్‌వర్క్18 గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా..  టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్‌ను నెట్‌వర్క్18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించింది. షేర్ స్వాప్ ద్వారా ఈ డీల్‌ జరుగుతుంది. 


IDFC ఫస్ట్ బ్యాంక్: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్, ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా IDFC ఫస్ట్ బ్యాంక్‌లో $100 మిలియన్ల విలువైన షేర్లను విక్రయించవచ్చు.


ఎయిర్‌టెల్: వార్‌బర్గ్ పింకస్, బ్లాక్‌ డీల్‌ ద్వారా భారతి ఎయిర్‌టెల్‌ షేర్లను అమ్మి $211 మిలియన్లను సమీకరించే అవకాశం ఉంది.


అదానీ పోర్ట్స్: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు, నాన్-క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం కోసం అదానీ పోర్ట్స్ బోర్డు ఈ నెల 12న సమావేశం అవుతుంది.


RITES: మేఘాలయలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్‌ల డెవలప్‌మెంట్‌ కోసం మేఘాలయ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో RITES ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.


భారత్ ఎలక్ట్రానిక్స్: రాడార్‌ల కోసం ఇండియన్ ఆర్మీ నుంచి రూ.580 కోట్ల ఆర్డర్‌ను భారత్ ఎలక్ట్రానిక్స్ అందుకుంది.


పేటీఎం: వినియోగదార్లు, వ్యాపారులకు ఎక్కువ మొత్తం రుణాలను పెంచడానికి, బ్యాంకులు, NBFCల భాగస్వామ్యంతో రుణ పంపిణీ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు Paytm ప్రకటించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మహిళల కోసం గోల్డెన్‌ టిప్స్‌ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?